Movie News

క్రేజీ సీజన్ వేస్టయిపోతోంది…

సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్‌ సెలవుల్లో వచ్చే రెండు వారాంతాల్లో సందడి ఉంటుంది. సెలబ్రేషన్ మూడ్‌లో ఉండే జనాలు థియేటర్లకు బాగానే వస్తారు. ఈ టైంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ కూడా బాగానే ఉంటుంది. ఈసారి కూడా రిలీజైన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వాటిలో భారీ అంచనాలున్న సినిమాలేవీ లేవు. తండేల్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ సినిమాలు క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడంతో ఈ సీజన్ కళ తప్పింది.

రిలీజైన మిగతా సినిమాలేవీ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయాయి. గత వీకెండ్లో నాలుగు సినిమాలు రిలీజైనా.. ఒక్కటీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. గత వారం రిలీజైన నాలుగు చిత్రాల్లో అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ ఒక్కటే స్ట్రెయిట్ మూవీ. దానిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.

అల్లరి నరేష్ నటన మినహాయిస్తే సినిమాలో స్టాండౌట్‌గా నిలిచే విషయాలు లేవు. సీరియస్ సినిమా కావడం వల్ల ఈ సినిమాకు సరైన వసూళ్లు కూడా రావట్లేదు. ఇక తమిళ అనువాద చిత్రం ‘విడుదల-2’.. విడుదల-1 తరహాలో మెప్పించలేకపోయింది. ఉపేంద్ర సినిమా ‘యుఐ’ ప్రేక్షకుల మెదడుకు చాలా పరీక్షలు పెడుతూ పర్లేదు అనే స్ధాయిలో వసూలు చేస్తుంది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా’లో మహేష్ వాయిస్ ఓవర్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు.

ఈ నాలుగు చిత్రాల్లో ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోయింది. ఇంతలో ఈ వారం మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర పోషించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’కు పెద్దగా బజ్ లేదు. డబ్బింగ్ సినిమాలు బరోజ్, మ్యాక్స్‌లకు కూడా హైప్ కనిపించడం లేదు. వీటి టాక్‌ను బట్టి థియేటర్లకు జనం వస్తారేమో చూడాలి. మొత్తంగా చూస్తే క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్ వేస్టయిపోతున్నట్లే కనిపిస్తోంది.

This post was last modified on December 24, 2024 7:59 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

14 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

50 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago