జైల్లో ఉన్న అల్లు అర్జున్.. ఏం చేశారు? ఎలా ఉన్నారు?

రియల్ సీన్: జైల్లో పుష్ప ఎలా ఉన్నారు? ఏం చేశారు?తొక్కిసలాట కేసులో జైలుకు వెళ్లిన పుష్ప అలియాస్ అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది. శుక్రవారం సాయంత్రం సుమారు 5-6 గంటల మధ్యలో జైలుకు వెళ్లిన ఆయన శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో విడుదల కావటం తెలిసిందే. నాంపల్లి కోర్టులో పద్నాలుగురోజులు రిమాండ్ విధించిన తర్వాత బన్నీ తరఫు లాయర్లు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఉత్తర్వును తెచ్చుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని భావించినా.. సాంకేతిక అంశాలతో జైలు నుంచి విడుదల కాని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైల్లో ఉన్న పుష్ప ఎలా ఉన్నారు? ఏం చేశారు? ఆయన తీరు ఎలా ఉంది? అన్న అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. అండర్ ట్రయల్ ఖైదీగా అల్లుఅర్జున్ కు యూటీ నెంబరు 7697ను కేటాయించారు. సెలబ్రిటీ కావటం.. వీవీఐపీ కావటంతో జైల్లో మంజీరా బ్లాక్ లో ఆయనకు గదిని కేటాయించినా.. ఆయన్ను ఒక్కరే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగిలిన ఖైదీలతో కలిసి ఉంచకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక.. జైల్లో సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ ఇస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు డిన్నర్ ఆఫర్ చేయగా.. ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని పండ్లు మాత్రమే తిన్నట్లు చెబుతున్నారు. జైల్లో ఒంటరిగా ఉన్న అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. అల్లు అర్జున్ బ్యారక్ లోకి తీసుకెళ్లే సమయానికే చంచలగూడ జైల్లోని ఖైదీలను వారి బ్యారక్ లోకి తీసుకెళ్లిపోయినట్లుగా సమాచారం.

మొత్తంగా జైల్లో ఉన్న కొన్ని గంటలు బన్నీ మౌనంగా.. గంభీరంగా ఉన్నట్లుగా జైలు వర్గాలు చెబుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు అధికారులకు థ్యాంక్స్ చెప్పిన ఆయన తన కారులో వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.