ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ కు బెయిల్ రావడం కష్టమని, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ హైకోర్టు లో బన్నీ కి భారీ ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అభిమానులందరూ ఊపిరి పీల్చుకునారనే చెప్పుకోవాలి.
అయితే, అనూహ్యంగా ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ పై కేసు వెనక్కు తీసుకునేందుకు సిద్ధమని రేవతి భర్త సంచలన ప్రకటన చేశారు. అల్లు అర్జున్ అరెస్టయిన విషయం తాను వార్తల్లో చూసి తెలుసుకున్నానని, తనకు పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు.
తను, తన భార్య, కుమారుడు తమ ఇష్టంతోనే సినిమాకు వెళ్లామని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని చెప్పారు. తన కొడుకు సినిమా చూస్తానంటేనే సంధ్య ధియేటర్ కు వెళ్లామని అన్నారు. తాజాగా రేవతి భర్త…అల్లు అర్జున్ పై కేసు విత్ డ్రా చేసుకుంటే ఆయన ఈ కేసు నుంచి బయటపడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates