ఒక్క పాటతో హైప్ పెంచేసిన భీమ్స్

జనవరి పండక్కు పోటీ పడుతున్న టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్నది, చివర్లో విడుదలవుతున్నది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. అందరికంటే ముందు గేమ్ ఛేంజర్ వస్తుండగా రెండు రోజుల గ్యాప్ లో డాకు మహారాజ్ రెడీ అవుతున్నాడు. మధ్యలో అజిత్ విదామూయర్చి నేనున్నా అంటున్నాడు. సందీప్ కిషన్ మజాకా ఇంతకు ముందు ప్రకటించారు కానీ వస్తుందో లేదో అనుమానంగానే ఉంది. ప్రమోషన్లైతే మొదలుపెట్టలేదు. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాంకి ఉన్న పరిమితుల దృష్ట్యా దీని మీద అంచనాలు పెంచడంలో సంగీతం కీలక పాత్ర పోషించనుంది.

ఇటీవలే విడుదల చేసిన గోదారి గట్టు మీద చందమామయ్యో తక్కువ టైంలో ఛార్ట్ బస్టర్ అయిపోయింది. మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతోంది. బుక్ మై షోలో ఇంటరెస్ట్ చూపిస్తున్న సంఖ్య అప్పుడే లక్ష దాటేసింది. డాకు మహారాజ్ కు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం మూడు నాలుగు వేలే ఉండటం గమనార్హం. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే సంక్రాంతికి వస్తున్నాం ఖచ్చితంగా రేసులో ముందుకొస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా ఫ్యామిలీని ఇట్టే ఆకట్టుకునే వెంకటేష్ మార్కుతో అనిల్ రావిపూడి కాంబో ఖచ్చితంగా పేలుతుందని అంటున్నారు.

ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోని. రవితేజ ధమాకాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాక మళ్ళీ అంతకు మించిన సినిమా పడలేదు. ఇప్పుడు వెంకటేష్ రూపంలో ఛాన్స్ దక్కింది. దాన్ని సరిగ్గా వినియోగించుకునే ప్లాన్ లో భాగంగా ఎప్పుడో మర్చిపోయిన రమణ గోగులని వెతికి తీసుకొచ్చి పాడించడం బ్రహ్మాండంగా పేలింది. మ్యూజిక్ లవర్స్ కి వింటేజ్ ఫీలింగ్ కలిగింది. భార్యా భర్తల మధ్య సరదాగా జరిగే రొమాన్స్ ని కంపోజ్ చేసిన తీరు మళ్ళీ మళ్ళీ వినేలా చేసింది. మొత్తానికి ఒక్క పాటతో భీమ్స్ హైప్ ని ఇటుపక్క లాగేశాడు. దెబ్బకు ప్రీరిలీజ్ వైబ్ పాజిటివ్ అయిపోయింది.