అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. అందుక్కారణం.. తన పెళ్లే. సమంత నుంచి విడిపోయాక రెండేళ్ల పైగా ఖాళీగా ఉన్న అతను.. ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. కొంత కాలం జర్నీ చేశాక ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ నెల 4న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి జరిగిన టైంలోనే రానా దగ్గుబాటి హోస్ట్‌గా అమేజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న టాక్ షోలో నాగచైతన్య ఎపిసోడ్ ప్రసారానికి సిద్ధమైంది.
పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయినట్లుంది. ఇప్పుడు స్ట్రీమింగ్‌కు వచ్చింది. రానా భార్య మిహిక బజాజ్.. చైతూ కజిన్ సుమంత్‌తో పాటు మరికొందరు అక్కినేని-దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ ఎపిసోడ్ ఎంతో హుషారుగా సాగింది. ఇందులో చైతూ చాలా వరకు వ్యక్తిగత విషయాల మీద ఎన్నో ఆసక్తికర కబుర్లు చెప్పాడు. తనకు ఇద్దరు పిల్లలు కావాలని.. వాళ్లతో సమయం గడపాలని ఉందని చైతూ ఈ షోలో చెప్పడం విశేషం.
‘‘50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా సమయం గడపాలని ఉంది’’ అని చైతూ చెప్పగా.. మీ వెంకీ మామలా నీకు పెద్ద ఫ్యామిలీ కావాలా అని రానా అన్నాడు. అందుకు చైతూ బదులిస్తూ.. ‘‘వెంకీ మామది పెద్ద ఫ్యామిలీ. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. కొడుకు పుడితే అతణ్ని రేస్ కోర్సుకు తీసుకెళ్తా. అమ్మాయి పుడితే తన హాబీస్, ఇష్టాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏదైనా చేస్తా. మనం చిన్నతనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం. మళ్లీ నా పిల్లలతో సమయం గడిపి ఆ రోజుల్లోకి వెళ్లాలనుకుంటున్నా.
కుటుంబమే నా జీవితం. అది లేకుండా లైఫ్‌ను ఊహించుకోలేను’’ అని చైతూ చెప్పాడు. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. సినిమాలతో పోలిస్తే ‘దూత’ వెబ్ సిరీస్ చేసినపుడు ఎంతగానో ఆస్వాదించానని.. సినిమా రిలీజైనపుడు టాక్ ఏంటి, వసూళ్లెలా ఉన్నాయి అనే టెన్షన్ ఉంటుందని.. కానీ ‘దూత’ రిలీజైనపుడు ఈ టెన్షన్ ఏం లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేశానని చైతూ చెప్పాడు. సాయిపల్లవితో చాలా కష్టమని, తనతో ఒక సీన్ చేసినా.. ఒక డ్యాన్స్ మూమెంట్ చేసినా చాలా టెన్షన్ వచ్చేస్తుందని ఈ సందర్భంగా చైతూ అన్నాడు.
This post was last modified on December 7, 2024 4:49 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…