జనవరి వరకు షూట్‌కి వెళ్లడని అనుకున్న పవన్‌కళ్యాణ్ ఈ నెలాఖరునుంచి ‘వకీల్ సాబ్’ షూట్ ప్లాన్ చేసుకోమని దిల్ రాజుకి చెప్పేసాడు. కేవలం ఇరవై అయిదు రోజులలో మిగతా షూటింగ్ పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా పెట్టాడు. అంటే నవంబర్ నెలాఖరుకి ఖచ్చితంగా పవన్ ఫ్రీ అయిపోతాడు. అయితే వెంటనే షూటింగ్ మొదలు పెట్టడానికి క్రిష్ సిద్ధంగా లేడు. అతను వేరే చిత్రం మొదలు పెట్టడంతో క్రిష్ వచ్చేలోగా పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చేద్దామనుకుంటున్నాడు.
పాటలు గట్రా లేని సినిమా కనుక రెండు, మూడు నెలలలో పూర్తయిపోతుందని పవన్ భావిస్తున్నాడు. బిజు మీనన్ పాత్ర చేయడానికి పవన్ ఆసక్తి చూపిస్తుండగా, మరో పాత్ర ఎవరు చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. రానా దగ్గుబాటితో చేయించాలనే దానిపై పవన్ మొదట్లో ఆసక్తి చూపించలేదని, కానీ ఇప్పుడు రానా అయినా ఓకే అంటున్నాడని వినిపిస్తోంది.
కాకపోతే ఈ చిత్రానికి ఇంతవరకు దర్శకుడు ఖరారు కాలేదు. దీనికి దర్శకుడిని ఖరారు చేసే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నాడు కానీ ఇంకా అతనికి కూడా ఎవరూ దొరికినట్టు లేరు. జనవరిలో షూటింగ్ మొదలు పెడతారు కనుక ఈలోగా దర్శకుడిని ఖరారు చేయాలని చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates