ఓ మూడేళ్ళ క్రితం వరకు శాండల్ వుడ్ లో తప్ప బయట ఎవరికీ తెలియని పేరు రిషబ్ శెట్టి. కన్నడలో ఇమేజ్, మార్కెట్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కనీసం డబ్బింగ్ రూపంలో అయినా ఇతని సినిమాలు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ కాంతారా మొత్తం జాతకాన్ని మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తీస్తే ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేయడం చరిత్ర. తెలుగు డబ్బింగ్ రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా రాబట్టడం గొప్ప మైలురాయి. అందుకే కాంతార 2 మీద మాములు అంచనాలు లేవు. వచ్చే ఏడాది అక్టోబర్ విడుదలకు ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్ ఉన్నాయి.
ఇంత ఫేమ్ వచ్చిన రిషబ్ శెట్టి ఏ విషయంలోనూ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే అతి పెద్ద గ్రాండియర్స్ లో ఒకటిగా దీన్ని తీర్చిద్దిద్దబోతున్నారనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీని రిషబ్ శెట్టి పట్టేశాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’లో వీరశివాజీగా కనిపించబోతున్నాడు. 2027 జనవరి 21 విడుదల తేదీని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు.
ఒకరకంగా చెప్పాలంటే రిషబ్ శెట్టికి డ్రీం ప్రాజెక్టులు పడుతున్నాయి. వాటి నేపధ్యాలు ప్యాన్ ఇండియా స్థాయిని దాటేలా ఉన్నాయి. కేవలం ఒక జానర్ కు పరిమితం కాకుండా, యష్ లాగా ఒక సినిమాకే ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టకుండా చేసుకుంటున్న ప్లానింగ్ ఇతన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా లేదు. శివాజీ మీద ఇప్పటికే బోలెడు సినిమాలొచ్చినప్పటికీ ఇప్పుడు తీయబోయేది మాత్రం నెవర్ బిఫోర్ తరహాలో ఉంటుందని ముంబై రిపోర్ట్. క్యాస్టింగ్, ఇతర సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడి చేయబోతున్నారు. 2025లో కాంతార 2, 2026లో జై హనుమాన్, 2027లో శివాజీ మహారాజ్ రిలీజవుతాయి. ఇది ప్లానింగ్ అంటే.
This post was last modified on December 3, 2024 12:05 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…