సిజ్లింగ్ లుక్‌లో సమ్యుక్త మాయాజాలం!

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో డానియల్ భార్య కమలిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ అద్భుతమైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. సాయి ధరంతేజ్ విరూపాక్ష చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత బింబిసారా, సార్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె స్వయంభు ,శర్వా37 చిత్రాలలో నటిస్తోంది.