బాలకృష్ణ ఫాన్స్ కి కిక్కిచ్చే ఖబర్!

బాలకృష్ణ సినిమాలకి ఇటీవల ఆదరణ తగ్గడంతో ఆయన ఈసారి కాస్త జాగ్రత్తపడ్డారు. అందుకే వేచి చూడడం అనేది తనకి అలవాటు లేకపోయినా కానీ బోయపాటి శ్రీను కథ సిద్ధం చేసేవరకు వేచి చూసారు. బోయపాటి ఇటీవల వినయ విధేయ రామ లాంటి అతి ఘోరమైన సినిమా తీసినా కానీ బాలక్రిష్ణని ఎలా చూపిస్తే మాస్ కి నచ్చుతుందో తెలిసిన దర్శకుడు కనుక ఫాన్స్ ఆ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

ఇదిలావుంటే వరుస హిట్స్ తో కమర్షియల్ ఫార్ములా బాగా తెలిసిన యువ దర్శకుడు అనిపించుకున్న అనిల్ రావిపూడికి బాలయ్య అంటే పిచ్చ అభిమానం. గోడల మీద బాలయ్య పోస్టర్లు అంటించుకున్నంత అభిమానం. బాలకృష్ణతో సినిమా చేయాలనేది అతని చిరకాల స్వప్నం.

దర్శకుడిగా ఇప్పుడు ఎంత డిమాండ్ పెరిగినా కానీ ఆ అభిమానం అలాగే ఉంది. అందుకే ఆయనతో సినిమా మాత్రం తీసి తీరాలని ఫిక్స్ అయ్యాడు. ఇది తెలిసి బాలయ్య కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా ఉంటుందని సమాచారం.