Movie News

పవన్ పాత ఇంటర్వ్యూలో ‘స్టూడియో’ ముచ్చట

చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లలోనే తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించి తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. ‘తొలి ప్రేమ’ నుంచి పవన్‌ రూటు మారిపోగా.. ఆ తర్వాత ‘ఖుషి’తో పవన్ ఇమేజ్ ఆకాశానికి చేరింది. ఆ సమయానికి అది ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం.

రూ.24 కోట్ల షేర్‌తో అప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ సినీ వార పత్రిక పవన్‌తో చేసిన ఇంటర్వ్యూ తాలూకు విశేషాలు ఇప్పుడు ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్నాయి.

‘ఖుషి’ సినిమాకు 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూ విశేషాల్ని అభిమానులు ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో పవన్ కొత్తగా ఏమీ ఆదర్శ భావాలు తెచ్చుకోలేదని.. ముందు నుంచి అతడి ఆలోచనలు వేరని.. అందుకు ఈ ఇంటర్వ్యూలోని విషయాలే నిదర్శనమని అంటున్నారు.

ఈ ఇంటర్వ్యూలో పవన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు సొంతంగా స్టూడియో పెట్టడానికి స్థలం కొంటున్నారని వార్తలొస్తున్నాయి కదా అని పవన్‌ను అడిగితే.. ‘‘నేనా స్టూడియోనా.. అలాంటి బిజినెస్ మైండ్ నాకు ఉంటే వేరేలా ఉండేది. స్టూడియో అంటే బిజినెస్. పెద్ద ఆర్గనైజేషన్. అలా బిజినెస్ లైన్లోకి వెళ్లాలంటే ఫ్రాంక్‌గా ఉండలేను. ఆర్టిఫిషియల్‌గా తయారవడం నాకు ఇష్టం లేదు. సినిమాలు చేస్తూ చేస్తూనే ఫట్ మని అన్నీ వదిలేసుకుని వెళ్లిపోయే తత్వం నాది. నన్ను నమ్మి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెడితే ఇంత అంతే సంగతి. నేను చెయ్యలేనని కాదు కానీ సినిమా మీద పెట్టే ఇంట్రెస్ట్ నేను బిజినెస్ మీద పెట్టలేను. అయితే వ్యవసాయం చేయడానికి పొలం కోసం చూస్తున్నాను. కానీ లక్షలు లక్షలు రేటు చెబుతున్నారు. చూద్దాం’’ అని పవన్ అన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో అన్నట్లే ఉన్నట్లుండి సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. అలాగే అప్పుడు అన్నట్లే కొన్నేళ్లకు పొలం కొని ఫాం హౌస్ కట్టుకుని అక్కడ పంటలు పండిస్తున్నాడు.

This post was last modified on April 28, 2020 6:01 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

9 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

9 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

10 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

10 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

12 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

13 hours ago