స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టి మాస్ ని ఒప్పించడం చాలా కష్టం. కానీ సుకుమార్ దాన్ని సాధ్యం చేసి చూపించారు. రంగస్థలంలో రామ్ చరణ్ కు చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలను మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ కి ఒకవైపు భుజం పైకి లేచిన లోపాన్ని అద్భుతంగా వాడుకున్నారు. దీనికన్నా ముందు మారుతీ భలే భలే మగాడివోయ్ లో నానికి మతిమరుపు పెట్టడం ద్వారా ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఒప్పుకోవాలి. రాబోయే గేమ్ ఛేంజర్ లోనూ చరణ్ క్యారెక్టర్ కు అలాంటి ట్విస్టు ఉంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ కి పరిమితం చేశారట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెకండాఫ్ లో పెద్ద వయసు అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ నత్తితో మాట్లాడతాడు. అయితే అది ఎబ్బెట్టుగా కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక కీలకమైన ట్విస్టుకి కారణం అవుతుందని అంటున్నారు. ఈ పాయింట్ ని ప్రేక్షకులు కనక సరిగా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మొత్తం ఓరేంజులో పేలిపోతుందని యూనిట్ ఊరిస్తున్నారు. పెర్ఫార్మన్స్ పరంగా చరణ్ దీన్ని అద్భుతంగా పోషించాడని, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మించి పేరు రావడం ఖాయమని షూటింగ్ టాక్. రామ్ నందన్ ఐఎఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అసలు విలన్ల భరతం పడతాడు.
జనవరి 10 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న గేమ్ ఛేంజర్ లో మూడో ఆడియో సింగల్ వచ్చే వారమే విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ ఖచ్చితంగా ఛార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే నెల అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక జనవరి మొదటి వారంలో రాజమండ్రి లేదా దాని దగ్గరి పరిసరాల్లో మరో పెద్ద వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఇంకా వివరాలు రాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హడావిడి తగ్గిపోయాక పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపిస్తాడు.
This post was last modified on November 25, 2024 6:13 am
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…
ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ…
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…