Movie News

వీరమల్లా ఓజినా – ఏది ముందు ?

నిన్నా మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల ఏదంటే అధికారికంగా ఖరారైన పేరు హరిహర వీరమల్లు ఒక్కటే. మార్చి 28 రిలీజ్ చేస్తామని అఫీషియల్ పోస్టర్ తో పాటు ప్రకటించారు. కానీ ఇప్పుడు దీని స్థానంలో ఓజిని తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతోందని లేటెస్ట్ అప్డేట్. ఇలా ఆలోచించడం వెనుక పెద్ద కహానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఓజి మీద విపరీతమైన హైప్ నెలకొంది. బయ్యర్లు రాజమౌళి రేంజ్ లో ఏరియాల వారీగా భారీ రేట్లు ఇచ్చి సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కొన్ని సెంటర్లు అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. ఓపెనింగ్స్ తోనే రికార్డులు బద్దలు కావడం ఖాయంగా ఉంది.

కానీ ఇంత బజ్ హరిహర వీరమల్లుకి లేదు. నిర్మాత ఏఎం రత్నం మూడేళ్ళకు పైగా వందల కోట్ల రూపాయల బడ్జెట్ దీని మీద ఖర్చు పెట్టారు. అంతకంతా వెనక్కు రావాలంటే ఓజిని మించి హైప్ సృష్టించాలి. టీజర్లు, పోస్టర్లు ఆ పనిని పూర్తి స్థాయిలో చేయలేకపోయాయి. ఒకవేళ రత్నం ఒక అడుగు వెనక్కు వేసి ఓజికి దారి ఇస్తే ఆయనకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఓజి కనక బ్లాక్ బస్టర్ అయితే వీరమల్లుకి డిమాండ్ పెరుగుతుంది. ప్యాన్ ఇండియా భాషల్లో ఎగబడి కొంటారు. ఎలాగూ పీరియాడిక్ గ్రాండియర్ కాబట్టి ప్రాంతీయత సమస్యలు రావు. అందుకే ఏదైనా అనూహ్య నిర్ణయం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఓజి, హరిహర వీరమల్లు రెండు సినిమాలను డిసెంబర్ లోగా పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. కానీ డిప్యూటీ సిఎంగా వరస పనులు, అసెంబ్లీ సమావేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఇలా అనుకున్నవి, అనుకోనివి ఎన్నో వచ్చి పడుతున్నాయి. సో ఒక ప్లాన్ ప్రకారం డేట్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంకొంచెం వాయిదా వేశారు. అభిమానుల జ్వరం చూస్తుంటే ఓజి తప్ప ఏదీ ఎక్కించుకునేలా లేరు. సో వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం పవన్ తర్వాతి సినిమాలకు ప్లస్ అవుతుంది.

This post was last modified on November 24, 2024 7:51 am

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

33 minutes ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

45 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

8 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago