‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇవాళే మొదలయింది. పది రోజుల పాటు నిరాటంకంగా సాగే ఈ షెడ్యూల్ చిన్న చిన్న గ్యాప్స్ తో మొత్తం రెండు నెలల పాటు జరుగుతుందట. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మొత్తం మార్చి లోగా పూర్తి చేసేసేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అయితే దాని గురించి అతను అధికారిక ప్రకటనలు ఏమీ చేయడం లేదు. అసలు రిలీజ్ ప్లాన్స్ గురించి కూడా రాజమౌళి ఇప్పుడేమీ చెప్పడం లేదు. ఈ షెడ్యూల్ తర్వాత ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ ప్రకటనతో రాజమౌళి షాక్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అసలు వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశమే లేదని, బహుశా 2022 సంక్రాంతికి విడుదలవుతుందని మీడియాలో చాలా వార్తలొచ్చాయి. కానీ రాజమౌళి మాత్రం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇన్‍సైడ్ న్యూస్.
అయితే ఇప్పటికే పలుమార్లు డేట్ మారడంతో మరోసారి ముందుగా డేట్ అనౌన్స్ చేసి తర్వాత మార్చడం ఇష్టం లేక డిసెంబర్‍లో రిలీజ్ డేట్‍ని ప్రకటిస్తారని, కానీ వచ్చే ఏడాది ఆర్.ఆర్.ఆర్. రావడమయితే ఖాయమని టాక్. ఆర్.ఆర్.ఆర్. ఆ టైమ్‍కి రావడం పక్కా అయితే ఇక మిగతా సినిమాలు వాటి రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates