మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కడప దర్గాకు రావడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇక్కడికి సెలబ్రెటీస్ రావడం కొత్తేమీ కాదు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఈ దర్గా అంటే బాగా సెంటిమెంట్. ఆయన ఏటా ఇక్కడికి వస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, ఐశ్వర్యారాయ్ సహా ఎంతోమంది సెలబ్రెటీస్ ఈ దర్గాను దర్శించిన వాళ్లే. రామ్ చరణ్ సైతం ‘మగధీర’ సినిమా విడుదలకు ముందు రోజు కడప దర్గాను దర్శించాడు.
ఐతే అప్పటికంటే ఇప్పుడు చరణ్ ఈ దర్గాకు రావడం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. అందుక్కారణం.. అతను అయ్యప్ప మాలలో ఉండడమే. ఇలాంటి సమయంలో దర్గాను దర్శించడం ఏంటి అంటూ కొందరు అభ్యంతరపెడుతున్నారు కూడా. ఓవైపు చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ హిందువుల సనాతన ధర్మం గురించి బలంగా మాట్లాడుతున్న సమయంలో చరణ్ ఇలా చేసి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఐతే చరణ్ తాను రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసమే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించాడు. “కడప దర్గాలో నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు నన్ను పిలిచిన నిర్వాహకులకు ధన్యవాదాలు. నా కోసం వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. పదిహేనేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘మగధీర’. ఆ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ఈ దర్గాకు వచ్చి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. నాకు మంచి స్టార్‌డం వచ్చింది. ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నానన్నగారు ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. బుచ్చిబాబుతో నేను చేయబోయే సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కడప దర్గాలో గజల్ కార్యక్రమం గురించి చెప్పారు. కచ్చితంగా ఈ ఈవెంట్‌కు వస్తానని ఆయనకు మాటిచ్చాను. ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ ఆయనకు ఇచ్చిన మాట తప్పకూడదని ఇక్కడికి వచ్చాను. ఎంతో ఆనందంగా ఉంది” అని చరణ్ వివరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates