తెరమీద సమంతాని చూసి అభిమానులకు చాలా గ్యాప్ వచ్చేసింది. అది పెద్ద ఎత్తున తీరిపోయే రోజు రావడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ రేపు కాగా ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రముఖ మల్టీప్లెక్సులో ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రీమియర్ వేశారు. స్పందన బాగానే కనిపించింది కానీ అందరూ పరిశ్రమ వ్యక్తులు కాబట్టి ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ తెలియాల్సి ఉంది. కానీ సామ్ పెర్ఫార్మన్స్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పిన దాఖలాలు నిన్న చాలానే ఉన్నాయి.
ఇది సమంతకు ఒక రకంగా పెద్ద పరీక్ష లాంటిది. ఎందుకంటే తన ఇమేజ్ మీదే సౌత్ లో మార్కెటింగ్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరో అయినప్పటికీ తెలుగు, తమిళ, మలయాల, కన్నడ ప్రేక్షకులు సమంతా కోసమే హనీ బన్నీ మీద లుక్ వేస్తారు. దీని కోసం సామ్ రిస్కీ ఫైట్లు, అడ్వెంచర్లు చేసింది. ఆర్యోగం బాలేని టైంలో చేయకూడదనుకుని దర్శకుడు రాజ్ అండ్ డీకే నెరేషన్ విన్నాక వెంటనే ఒప్పేసుకుంది. స్వంత బ్యానర్ లో కొన్ని నెలల క్రితం బంగారం అనే మూవీ ప్రకటించిన సామ్ తర్వాత దాని అప్డేట్స్ ఇవ్వకపోవడమే కాదు దక్షిణాదిలో కొత్త కమిట్ మెంట్స్ సైన్ చేయలేదు. సిటాడెల్ కోసమే ఆగింది.
యాక్షన్ కం మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సిటాడెల్ హనీ బన్నీకి ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు దర్శకత్వం వహించడంతో అంచనాలు మాములుగా లేవు. గత కొంత కాలంగా బ్లాక్ బస్టర్ కంటెంట్ లేక కొంచెం నెమ్మదించిన ప్రైమ్ కు ఇప్పుడీ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. ట్రైలర్, ప్రొడక్షన్ వేల్యూస్ వగైరా ఘనంగా ఉన్నాయి కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న ఇలాంటి సబ్జెక్టుని మన ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు ఎలా మలిచారన్నది చూడాలి. తెలుగు, తమిళ, హిందీతో సహా ప్రధాన భాషల్లో హానీ బన్నీ వస్తోంది. ఇది కాకుండా తుంబడ్ ద్వయం తీస్తున్న రక్త్ బ్రహ్మాండ్ – ది బ్లడీ కింగ్ డంలో సామ్ నటిస్తోంది.
This post was last modified on November 6, 2024 3:13 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…