దర్శకుడిగా రణం మినహా మిగతా అన్నిటితోనూ అమ్మ రాజశేఖర్ అమ్మో అనిపించాడు. కొంతకాలంగా దర్శకుడిగా అవకాశాలు లేక, డాన్స్ మాస్టర్‍గాను ఛాన్స్ లు రాక ఖాళీగా వున్న ఈ తమిళ టెక్నీషియన్‍కు బిగ్‍బాస్ సీజన్ 4లో చోటిచ్చారు. ప్రతి ఏటా ఒక కొరియోగ్రాఫర్ వుండేలా చూసుకుంటోన్న స్టార్ మా యాజమాన్యం ఈసారి ఆ కోటాలో అమ్మ రాజశేఖర్‍ని పంపించారు.
మొదట్లో కుళ్లు జోకులు అవీ వేసి కాస్త నవ్వించినా కానీ తర్వాత్తర్వాత అమ్మ రాజశేఖర్ స్వభావం బిగ్‍బాస్ వీక్షకులను విసిగిస్తోంది. తనను జీరో అంటూ దేవి, లాస్య ట్యాగ్ చేసినపుడు రాజశేఖర్ ఉడుకుమోతుతనం దాచుకోలేక ఏడ్చేసాడు. దివితో ఫిజికల్ అవుతున్నాడని లాస్య చెప్పడంతో అతని దుఃఖం కట్టలు తెంచుకుంది.
లాస్య అనడం కాదు కానీ నిజంగానే దివి గురించి పలుమార్లు రాజశేఖర్ ‘నా ఫిగరు’ అనడం ప్రేక్షకులు విన్నారు. ఆమెని స్వంతంగా ఆట ఆడనివ్వకుండా పలుమార్లు ప్రభావితం చేయడం కూడా ప్రేక్షకులు గమనించారు. జీరో అనడంతో రాజశేఖర్ ఏడుపు లంగించుకోవడంతో అతడిని హౌస్‍మేట్స్ నామినేట్ చేయడం కూడా మానేసారు. ఇక బిగ్‍బాస్ టాస్కులలో కూడా రాజశేఖర్ తన జోలికి ఎవరూ రాకూడదు అనే ధోరణి కనబరుస్తున్నాడు. ఎవరైనా తెలివిగా గేమ్ ఆడితే తట్టుకోలేక వారి మీద కస్సుబుస్సులాడుతున్నాడు. గత వారం, ఈవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
ఇక మోనల్ గజ్జర్ అయితే ఓడిపోతే తట్టుకోలేక ఏడుపు అందుకుంటోంది. నిన్న గేమ్‍లోనుంచి అవుట్ అయ్యాక ఆమె బాత్రూమ్‍లోకి వెళ్లి బిగ్గరగా ఏడవడం ప్రేక్షకులను చిరాకు పెట్టింది. ఈమె కూడా అఖిల్, అభిజీత్ లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుండడంతో మోనల్‍కి కూడా వ్యతిరేకత తారాస్థాయిలో వుంది. వీరు నామినేషన్లలోకి వస్తే త్వరగా ఎగ్జిట్ అవడం ఖాయమనేది సోషల్ మీడియా టాక్.
This post was last modified on October 2, 2020 9:23 am
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…