జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కలయికలో రూపొందుతున్న వార్ 2 ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేశాక ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో తారక్ పాల్గొంటున్నాడు. దేవర ప్రమోషన్ల కోసం తీసుకున్న సుదీర్ఘమైన బ్రేక్ ఊహించిన దానికన్నా ఎక్కువగా బ్లాక్ బస్టర్ రూపంలో ఫలితాన్ని ఇచ్చింది. ఆ సంతోషాన్ని మోసుకుంటూ వార్ 2 సెట్లలో అడుగు పెట్టాడు. అయితే డబ్బింగ్ వెర్షన్ల కోసం టైటిల్ మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడం ఫ్యాన్స్ ని అయోమయానికి గురి చేసింది. యుద్ధభూమి పేరుని తెలుగు, తమిళ తదితర బాషల కోసం పెడుతున్నారనేది ప్రధాన సారాంశం.
అయితే యూనిట్ నుంచి ఆఫ్ ది రికార్డు అందుతున్న సమాచారం మేరకు వార్ 2ని మార్చే ప్లాన్ ఏదీ టీమ్ లో లేదట. యుద్ధభూమిని కేవలం క్యాప్సన్ గా పెట్టే ఆలోచన మాత్రం ఉందని అంటున్నారు. వార్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక టైటిల్ మార్చే తొందరపాటు చర్య యష్ రాజ్ ఫిలింస్ చేయదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. పైగా స్పై యూనివర్స్ ని విస్తరించే క్రమంలో టైగర్, పఠాన్, కబీర్, అల్ఫా పాత్రలన్నింటినీ అవెంజర్స్ తరహాలో డిజైన్ చేస్తున్నారు నిర్మాత ఆదిత్య చోప్రా. వార్ అనేది బలంగా చొచ్చుకుపోయిన బ్రాండ్. సో దానికి 2 నెంబర్ పెట్టడమే న్యాయమని ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 చిత్రీకరణ ఫిబ్రవరిలోగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేలా వర్క్ చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని బెస్ట్ యాక్షన్ విజువల్స్ వార్ 2లో ఉంటాయని లీకుల రూపంలో వస్తున్న ఊరింపు. నాటు నాటుని మించిపోయేలా తారక్, హృతిక్ మధ్య ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంటుందని, ఇద్దరి డేట్లు, సమయం సందర్భం అన్నీ సెట్ చేసుకుని దీన్ని షూట్ చేస్తారట. 2025 వేసవి నుంచి ప్రమోషన్లు మొదలుపెడతారని సమాచారం.
This post was last modified on October 21, 2024 1:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…