నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె 109కు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. మొదటిది టైటిల్. కొన్ని పేర్లు పరిశీలనలో ఉంచారు కానీ ఏది ఫైనలవుతుందనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. రెండో మ్యాటర్ విడుదల తేదీ. జనవరి 9 అనుకుంటున్నట్టు ట్రేడ్ వర్గాలకు అందిన ప్రాధమిక సమాచారం మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. సంక్రాంతి పండక్కు అందరి కంటే ముందు రావడం ఓపెనింగ్స్ పరంగా ఉపయోగపడుతుంది కానీ థియేటర్ల పరంగా తర్వాత వచ్చే ఇబ్బందులు కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తాయి.
ఎందుకంటే జనవరి 10 గేమ్ ఛేంజర్ ఉంది. నిర్మాత దిల్ రాజు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు డిస్ట్రిబ్యూషన్ ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున థియేటర్ అగ్రిమెంట్లకు పావులు కదుపుతున్నారు. బాలయ్య 109 నిర్మాత నాగవంశీతో వ్యాపార పరంగా లావాదేవీలు, సాన్నిహిత్యం ఉన్నప్పటికీ స్వంత సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే అనేది ఇండస్ట్రీ సూత్రం. అలాంటప్పుడు బాలకృష్ణకు రెండో రోజు నుంచి స్క్రీన్లు తగ్గడం మొదలయ్యే ప్రమాదం ఉంది. పైగా ఒకవేళ వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా బరిలో ఉంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది.
దీనికన్నా జనవరి 12 బాలయ్య రావడం అన్ని విధాలా సేఫ్ అనేది ఫ్యాన్స్ ప్లస్ బయ్యర్స్ ఇద్దరూ అనుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే లేట్ వచ్చినా సమస్య లేదు. గత ఏడాది వాల్తేరు వీరయ్య వచ్చింది వీరసింహారెడ్డి తర్వాత. రెండు హిట్టయ్యాయి కానీ రెవిన్యూ పరంగా పై చేయి సాధించింది చిరంజీవే. సో ఇలాంటి అవకాశం ఎవరికైనా రావొచ్చు. అలాంటప్పుడు జనవరి 9తో ముడిపడిన రిస్కులు విశ్లేషించుకోవడం అవసరం. దీపావళి పండక్కు అనౌన్స్ మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆ లోగా డెషిషన్ జరిగిపోవాలి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో దర్శకుడు బాబీ, బాలయ్య ఇద్దరూ బిజీగా ఉన్నారు.
This post was last modified on October 21, 2024 1:48 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…