Movie News

సలార్ ప్రపంచంలోకి కొండవీటి దొంగ వస్తే

దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయకపోయినా కథను ఇచ్చాడన్నా చాలు ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. అందులోనూ హోంబాలే ప్రొడక్షన్ అంటే వేరే చెప్పాలా. అదే బఘీరా. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 31 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీమురళి హీరోగా నటించాడు. మనకు పెద్ద పరిచయం లేదు కానీ నీల్ డెబ్యూ మూవీ ఉగ్రమ్ కథానాయకుడు తనే. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంగానే దర్శకత్వం వహించలేని పరిస్థితుల్లో ఫ్రెండ్ కోసం స్టోరీ రాసి పెద్ద బడ్జెట్ ఇచ్చే నిర్మాణ సంస్థను సెట్ చేశాడు. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.

ఆశ్చర్యం అనిపించేలా స్టోరీ మొత్తం అర్థమయ్యేలా గుట్టు విప్పేశారు. చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన హీరో పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతాడు. చట్టప్రకారం దుర్మార్గులను అంతం చేయలేమని గుర్తించి ఎవరూ పసిగట్టకుండా ఒక మాస్కు వేసుకుని కొండవీటి దొంగ తరహాలో చెడ్డవాళ్లను అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. ఒకపక్క ఖాకీ దుస్తుల్లో డ్యూటీ చేస్తూనే, ఇంకోవైపు అసురుల పాలిట సింహస్వప్నంగా మారతాడు. డిపార్ట్ మెంట్ మొత్తం వెంటపడినా చివరికి తాను అనుకున్న లక్ష్యం చేరుకుంటాడు. ఆ ముసుగు వీరుడి పేరే బఘీరా. పాయింట్ కోణంలో గతంలో చూసినట్టే ఉంది కదూ.

మేకింగ్ పరంగా సలార్, కెజిఎఫ్, ఉగ్రమ్, మఫ్టీ (శ్రీమురళి మరో సినిమా) షేడ్స్ పుష్కలంగా ఉన్న బఘీరాకి విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. విజువల్స్ లో భారీతనం కొట్టొచ్చినట్టు ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ సీనియర్ అధికారిగా కనిపిస్తాడు. హైప్ అమాంతం పెరుగుతుందని చెప్పలేం కానీ హీరోయిజం ఎలివేషన్ల మీదే ఎక్కువగా ప్రశాంత్ నీల్ ఒరవడినే ఫాలో అవుతూ దర్శకుడు సూరి ఈ బఘీరాని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. లక్కీ భాస్కర్, క, అమరన్, జీబ్రాలతో పోటీ పడుతున్న బఘీరాకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సవాళ్ళే ఉన్నాయి.

This post was last modified on October 21, 2024 11:08 am

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

1 hour ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

1 hour ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

7 hours ago