హెల్దిగా ఉండడం కోసం మనం తీసుకునే ఆరోగ్యకరమైన డైట్ లో సూపర్‌ఫుడ్స్‌ను భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాలలో అవిసె గింజలు, లేదా ఫ్లాక్స్ సీడ్స్, ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. చూడడానికి చిన్నగా, సాధారణంగా కనిపించే ఈ అవిసె గింజలలో పుష్కలంగా ఉండే పోషక విలువలు మన శరీరానికి అవసరమైన అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, లిగ్నాన్స్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ప్రతి వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా మారతాయి. ముఖ్యంగా, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, జీర్ణక్రియను సక్రమంగా ఉంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం లో సహాయ పడుతాయి.
అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది కడుపు నిండిన భావాన్ని కల్పించి, అధికంగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి అవిసె గింజలు బాగా హెల్ప్ ఆయుతాయి.
ఇందులో లిగ్నాన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించగలవు. అదనంగా, అవిసె గింజలు చర్మానికి తేమను అందించి, చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, మహిళల హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. రుతుక్రమ సమస్యలు లేదా మెనోపాజ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
అవిసె గింజలను సలాడ్లు, పెరుగు, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. అలాగే, ఈ గింజల నూనెను వంటలలో ఉపయోగించడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, ఇవి అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తం పలుచబడే మందులు వాడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. ఆహారంలో చిన్న మార్పులతోనే మన ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అందులో అవిసె గింజలు ఒక అద్భుతమైన ఛాయిస్.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates