ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే సగ్గుబియ్యం…

పండుగ సమయంలో పాయసం చేయడానికి ఉపయోగించే సగ్గుబియ్యం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? కర్రపెండలం నుంచి తయారు చేసే సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం, మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మరియు విటమిన్ కె కూడా ఇందులో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే శిశువులకు చాలా మేలు చేస్తుంది.

సగ్గుబియ్యం తయారుచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట కర్రపెండలంపై తొక్కను తీసి శుభ్రం చేస్తారు. తర్వాత చెరకు రసం తీసే విధానంలో పెండలం నుంచి పాలలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ పిండిని చిక్కగా చేసి, జల్లెడలాంటిది ఉపయోగించి సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. తర్వాత అవి మెత్తగా ఉండే విధంగా ఉంచి, పెద్ద పెనంపై వేడి చేసి ఎండలో ఆరబెడతారు. ఇలా తయారైన సగ్గుబియ్యం ఎన్నో వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. రుచికరమైన పాయసాలు, ఉప్మాలు, వడలు మొదలైన వాటిలో వీటిని ఉపయోగించి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏటువంటి రసాయనాలు లేకపోవడం వల్ల ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా సురక్షితం. ఇందులోని ఫోలిక్ యాసిడ్ , విటమిన్ బి గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇందులో అధిక మోతాదులో లభించే కాల్షియం ,ఐరన్ వల్ల ఎముకలు బలంగా మారతాయి. రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

అమైనో యాసిడ్స్ వల్ల కండరాల బలం పెరుగుతుంది. సగ్గుబియ్యం లో అధిక మోతాదులో లభించే టైటరి ఫైబర్ జీర్ణక్రియ సంబంధిత అన్ని సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యం క్రమంగా తీసుకునే వారికి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి, గట్ హెల్త్ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో కూడా సగ్గుబియ్యం ఉపకరిస్తుంది. బలహీనంగా ఉన్నవారు దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందుతారు. అయితే, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా సగ్గుబియ్యం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం కానీ అది ఎప్పుడూ పరిమితమైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

గమనిక:

పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.