Health

ఈ చిన్ని మార్పులతో చక్కటి ఆరోగ్యం మీ సొంతం…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యం ఏదో ఒక ఇన్ఫెక్షన్.. వైరస్ లాంటివి అందరినీ భయపెడుతున్నాయి. ఇది మనకు సోకడానికి ముఖ్య కారణం మనలో ఇమ్యూనిటీ లోపించడం. మనం ఆరోగ్యంగా ఉంటే ఇటువంటి వైరస్లు మన మీద అంతగా ప్రభావం చూపించలేవు. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి.. అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం.

మనలో చాలామందికి హెల్తీగా ఉండాలి అని కోరిక ఉంటుంది. అయితే ఒక కోరిక ఉంటే సరిపోదు కదా.. ఆ కోరికను నిజం చేసుకోవాలి అంటే మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. మీ లైఫ్ స్టైల్ లో తేలికపాటి మార్పులు చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభం అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం కూరగాయలు, పండ్లు తింటే సరిపోదు.. ఒక క్రమబద్ధమైన జీవనశైలి, వ్యాయామం వంటిది కూడా ఎంతో అవసరం.

ఆరోగ్యంగా ఉండటానికి మొదటగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోజూ తినే ఆహారం మన శరీరానికి కావలసిన పోషకాలను అందించే విధంగా ఉండాలి . ఆహారం లో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు ఉండాలి. అలాగే, అధిక షుగర్ కంటెంట్ వున్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

వ్యాయామం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వర్కౌట్స్ చేయడం, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అలాగే, మెడిటేషన్ కూడా మనశ్శాంతికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదయం వర్కౌట్ చేసేటప్పుడు, 5-10 నిమిషాల మెడిటేషన్ చేయడం చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉండటానికి సహజంగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖ్యంగా, సరైన నిద్ర కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. మనలో చాలామందికి ఫోన్ చూస్తూ అలా నిద్రపోవడం అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల మీరు నిద్రించే సమయం చాలా వరకు తగ్గిపోతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ప్రతి రోజు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర పడడం ఎంతో ముఖ్యం. సరైన నిద్ర శరీరాన్ని రిపేర్ చేసి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ఇక రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నీటిని తాగడం వల్ల శరీరం సజావుగా పనిచేస్తుంది. కాబట్టి, మనం సరైన నిద్ర, సరైన ఆహారం, వ్యాయామం, మరియు హైడ్రేషన్ వంటి సరైన నియమాలను పాటిస్తే, ఆరోగ్యంగా , ఉల్లాసంగా ఉంటాము.

గమనిక:

పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.

This post was last modified on January 5, 2025 11:21 pm

Share
Published by
Kumar

Recent Posts

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

17 minutes ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

2 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

2 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

4 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

5 hours ago