Health

టీ, కాఫీ తాగే వారికి ఆ క్యాన్సర్ ప్రమాదం లేనట్టే!

మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు అన్న వాదన వింటూ వస్తున్నాం. ఆరోగ్యం కోసం ఈ అలవాట్లు మానుకోలేక.. అలాగని తాగాలనిపించినప్పుడు కాఫీ, టీ తాగలేక మనలో చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారికి తాజాగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఓ శుభవార్త అందించింది.. మీకు టి, కాఫీ తాగే అలవాటు ఉంటే ఇక నిరభ్యంతరంగా తాగొచ్చు.

తాజాగా, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిర్వహించిన అధ్యయనంలో టీ, కాఫీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని నిర్ధారించారు. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 14 వివిధ రీసెర్చ్‌లకు సంబంధించిన డేటాను పరిశీలించారు. ఇందులో 9,500 క్యాన్సర్ బాధితులు, 15,700 మందికిపైగా ఆరోగ్యకరమైన వ్యక్తుల డేటాను పరిశీలించారు.

ఈ పరిశోధనలో, ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వెల్లడైంది. ముఖ్యంగా నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ల ముప్పు తగ్గుదల కనిపించిందని అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యాన్సర్ వ్యాధిన పడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా మనం తీసుకునే కాఫీ టీ కాన్సర్ని తగ్గిస్తుంది అనడం నిజంగా శుభవార్త కాక మరేమిటి.

రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గడంతో పాటు ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో ఓరల్ కేవిటీ క్యాన్సర్ ముప్పు 30 శాతం తగ్గుతుందని, గొంతు క్యాన్సర్ ముప్పు 22 శాతం తగ్గుతుందని తేలింది. అంతేకాదు, రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగడం ద్వారా హైపోఫారింజియల్ క్యాన్సర్ ముప్పు 41 శాతం తగ్గుతుందట.

ఇక టీ తాగడం కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో ప్రభావవంతమని ఈ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 శాతం తగ్గుతుందని వెల్లడించారు. ముఖ్యంగా హైపోఫారింజియల్ క్యాన్సర్ ముప్పు 27 శాతం తగ్గుతుందని అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి.

ఇలా టీ, కాఫీతో క్యాన్సర్ ముప్పును కొంతమేర తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచించారు. అయితే, మితంగా తాగడమే మేలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కేవలం టీ లేక కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గిపోదు.. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మంచి జీవన శైలిని కూడా అలవాటు చేసుకోవాలి.

గమనిక:

పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.

This post was last modified on January 4, 2025 8:18 am

Share
Published by
Kumar

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

6 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

12 hours ago