Bhakti

గురు పూర్ణిమ 2025: ఈశా లో సద్గురు సత్సంగం

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు, ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆదియోగి మొదట ఆదిగురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్తరుషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు, ఇది భారతదేశంలో పవిత్రమైన గురు శిష్య పరంపర ప్రారంభాన్ని సూచిస్తుంది. అప్పటి నుండి, గురు పూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్ని భారతదేశమంతటా చాలా ఆనందంతో ఇంకా భక్తితో జరుపుకుంటారు.

కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌, సద్గురు ఆశ్రమంలో, మెడిటేటర్లు మరియు ఆశ్రమవాసులు ఈ సంవత్సరం జూలై 10న గురు పూర్ణిమని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం కార్యక్రమాలు మరియు సంబరాల విశేషాలను ఇక్కడ చూద్దాం.

సద్గురు అర్పణం – గురు పూర్ణిమ రోజు ఉద్యాపన

ఈ సంవత్సరం, మొదటిసారిగా, సద్గురు అర్పణం అనే ఏడు రోజుల ఆన్‌లైన్ సాధనని అందిస్తున్నారు, ఇది పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ముగుస్తుంది. ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన గురు పూర్ణిమ మంత్రం మరియు ధ్యానలింగానికి పవిత్రమైన సమర్పణతో సాధనని ముగిస్తారు.

ధ్యానలింగం వద్ద పూర్ణిమ సమర్పణలు

భక్తులు ధ్యానలింగంలో క్షీరార్పణం (పాల అర్పణ) మరియు జలార్పణం (నీటి అర్పణ) సమర్పించవచ్చు. క్షీరార్పణం సాధారణంగా ఉదయం (6 AM నుండి 1 PM వరకు) అందిస్తారు, జలార్పణం మధ్యాహ్నం ఇంకా సాయంత్రం (1 PM నుండి 8 PM వరకు) అందిస్తారు.

ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజు ధ్యానలింగానికి క్షీరార్పణం మరియు జలార్పణం అర్పించి, దాని శక్తితో అనుసంధానమై ధ్యానలింగ అనుగ్రహాన్ని పొందే శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది గురు పూర్ణిమన రోజున – భక్తులు గురువుతో తమ అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఇదొక అరుదైన అలాగే పవిత్రమైన అవకాశం.

గురు పూర్ణిమ సాయంత్రం

ఈసారి కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరుగుతున్న గురు పూర్ణిమ సంబరాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న సద్గురుతో ప్రత్యేక సత్సంగం. సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమైయ్యే ఈ సత్సంగంలో సద్గురుచే  శక్తివంతమైన గైడెడ్ ధ్యానం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ఈశా సంగీత బృందం సౌండ్స్ ఆఫ్ ఈశాతో కలిసి ప్రసిద్ధ కళాకారుల అద్భుతమైన ప్రదర్శనలు, మోహిత్ చౌహాన్, రామ్ మిర్యాల, పార్థివ్ గోహిల్మరియు స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ఉత్సాహభరితమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన అందిచేందుకు త్రినిదాదియన్ సోకా కింగ్ మాచెల్ మాంటానో కూడా ఇందులో పాల్గొంటున్నారు.

సద్గురు సత్సంగం లైవ్‌స్ట్రీమ్

వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లేదా ఎంపిక చేసిన ఈశా స్థానిక కేంద్రాలలో గురు పూర్ణిమ సత్సంగం లైవ్‌స్ట్రీమ్‌లో చేరవచ్చు.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, ఒడియా, నేపాలీ మరియు ఇతర ప్రపంచ భాషలలో కూడా లైవ్‌స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.

This post was last modified on July 10, 2025 1:55 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

1 hour ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

1 hour ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

1 hour ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago