లాల్ సింగ్ చడ్డా డిజాస్టరని తేలిపోయినా అమీర్ ఖాన్ ని మాత్రం నెటిజెన్లు వదలడం లేదు. గతంలో చేసిన కామెంట్లను అపార్థం చేసుకోకండి దయచేసి సినిమా చూడమని ఎంతగా అభ్యర్థించినా లాభం లేకపోయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలే దిశగా పరుగులు పెడుతున్న లాల్ సింగ్ ఇక రికవర్ కావడం కష్టమే.
సరే సినిమాలో కంటెంట్ కూడా వీక్ గా ఉంది కాబట్టి కేవలం బాయ్ కాట్ వివాదాన్ని నెపంగా చూపలేం అనుకుంటున్న తరుణంలో ఈ విలక్షణ నటుడి మెడకు మరో తలనెప్పి వచ్చి చేరింది. ఇటీవలే అమీర్ ఖాన్ కొత్త సిరీస్ మొదలుపెట్టిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్నాడు.
అఫ్కోర్స్ తన మూవీ ప్రమోషన్ కోసమే లెండి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ కు దేశం కోసం పోరాడిన నిజమైన సైనికులను ఆర్మీ ఆఫీసర్లను తీసుకొచ్చారు. వాళ్ళతో మాటామంతి, వార్ ఫీల్డ్ లో వాళ్ళు ఎదురుకున్న వీరోచితంగా సందర్భాలు అన్ని వినే అవకాశం దక్కింది. సరే తను కూడా ఆ పాత్ర చేశా కదా పబ్లిసిటీకి ఉపయోగపడుతుందన్నది అమీర్ ఆలోచన. దానికి తగ్గట్టే హుషారుగా విచ్చేశాడు.
అంతా బాగానే ఉంది కానీ ప్రోగ్రాంలో భాగంగా జవాన్లకు గౌరవ సూచకంగా అమితాబ్ తో సహా అక్కడికి వచ్చిన వాళ్ళు సెల్యూట్ చేశారు. కానీ అమీర్ మాత్రం చేతులు కిందే ఉంచాడు. ఈ వీడియో కాస్తా బయటికి వచ్చేసి వైరల్ అయిపోయింది. మీడియా ఈ ప్రస్తావన తెస్తే దాన్ని కవర్ చేసుకోలేక లాల్ సింగ్ పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. అవునా సెల్యూట్ చేయలేదా నేను చేశా అనుకున్నా అయినా అలా చేయాలని తట్టలేదని ఏదేదో చెప్పబోయి మొత్తానికి నాలుక తడబడింది. దెబ్బకు అమీర్ మీద ఆల్రెడీ ఉన్న వ్యతిరేకత ఇంకాస్త ఎక్కువయ్యింది
This post was last modified on August 15, 2022 10:38 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……