Trends

లాక్ డౌన్ 3.0…ఎక్క‌డెక్క‌డ అమ‌లుతుందంటే…

దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తున్న క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ విష‌యంలో మ‌రో కీల‌క ప‌రిణామం. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న లాక్ డౌన్ రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో ఉంటుందా? లేక‌పోతే ముగిసిపోతుందా? అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్్చింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే మిగిలింద‌ని తెలుస్తోంది.

లాక్ డౌన్ పొడ‌గించ‌డం దాదాపుగా ఖ‌రారైంది. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్స్‌కు లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని, గ్రీన్‌జోన్స్‌లో నియంత్రణతో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు సీఎంలు కోరారు. దీంతో ద‌శ‌ల వారీ స‌డ‌లింపే కాకుండా ఒక్క‌సారిగా లాక్ డౌన్ ముగింపు ఉండ‌ద‌ని తెలుస్తోంది.

ప్రాణాంతక వైరస్‌ను నియంత్రించడానికి ఏం చేయాలనే విషయంలో ముందస్తు ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదింపులు జరిపి వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది… ఎలాంటి చర్యలు తీసుకోవాలి… లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారా వంటి అంశాలను మోదీ వారినడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు సీఎంలు మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి ఇవ్వరాదని కోరారు. అలాగే, ప్రయివేటు వాహనాలకు నిబంధనలతో అనుమతివ్వాలని కోరారు. లాక్‌డౌన్‌ పొడిగింపునకే మెజార్టీ ముఖ్యమంత్రులు ఓటువేశారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మాట్లాడుతూ దేశం ఇప్పటివరకు రెండు లాక్‌ డౌన్లను చూసిందని, ఇప్పుడు మనం భవిష్యత్‌ గురించి ఆలోచించాలనీ స్పష్టం చేశారు. వచ్చే నెలల్లో కరోనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉండడం వల్ల ”రెండు గజాల దూరం” మంత్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని చెప్పారు.

రాబోయే రోజుల్లో మాస్కులు, ఫేస్‌ కవర్లు మన జీవితంలో భాగమైపోతాయని, ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనే మనందరి తప్పనిసరి లక్ష్యం కావాలని ప్రధానమంత్రి మార్గనిర్దేశం చేశారు. కాగా, మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి రెండు గజాల దూరం మంత్రాన్ని పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

పలు దేశాల మొత్తం జనాభాతో పోలిస్తే మన దేశ జనాభా చాలా ఎక్కువైనా లాక్‌డౌన్‌ విధించడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడుకోగలిగామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరుతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం కూడా ముఖ్యమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై మే 3వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

This post was last modified on April 28, 2020 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొండ దేవర : ఇది కదా తమన్ అసలైన జాతర!

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత…

20 minutes ago

బాలయ్య – చరణ్ అంచనాలు పెంచేశారు!

అన్ స్టాపబుల్ సీజన్ 4 మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే…

45 minutes ago

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. భారత్‌ ఆశలు ఆవిరి

టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు…

1 hour ago

దిల్ రాజుకి ఇంతకన్నా ప్రశంస ఏముంటుంది

సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా…

2 hours ago

ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారికి సుప్రీం షాక్

ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…

3 hours ago

అడవి దొంగల వేటగాడు ‘డాకు మహారాజ్’

https://youtu.be/fNDRSver0uM?si=FuJxROyuCDfNq7jV వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ…

4 hours ago