వినోద్ కాంబ్లి.. 80, 90 దశకాల్లో ఇండియన్ క్రికెట్‌ను ఫాలో అయిన ఏ అభిమానీ ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. సచిన్‌తో కలిసే క్రికెట్ సాధన ఆరంభించి.. చాలా ఏళ్ల పాటు అతడితో కలిసే సాగాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి తన లాగే మెరుపులు మెరిపించాడు.
సచిన్ లాంటి క్రమశిక్షణ, పట్టుదల ఉంటే.. అతడి లాగే ఒక దిగ్గజ క్రికెటర్ అయ్యేవాడేమో. కానీ కెరీర్లో కొన్నేళ్ల పాటు మెరుపులు మెరిపించాక ఫామ్ కోల్పోవడంతో కెరీర్ గాడి తప్పింది. తర్వాత మళ్లీ పుంజుకోలేకపోయాడు. చూస్తుండగానే కనుమరుగైపోయేవాడు. మంచి వయసులో ఉండగానే ఆటకు దూరమైపోయాడు. కొన్నేళ్లకే గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. చాలా ఏళ్లుగా కాంబ్లి పేరే ఎక్కడా వినిపించడం లేదు.
ఇప్పుడు ముంబయిలో కాంబ్లి దయనీయ స్థితిలో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తిగా బలహీన పడిపోయి, ముసలివాడిలా తయారైన కాంబ్లి.. నడవలేని స్థితిలో కనిపించాడు. కాళ్లు వంకర పోయి నడవలేకపోతుంటే ఇద్దరు ముగ్గురు సాయపడి ఆయన్ని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఎలాంటి కాంబ్లి ఎలా అయిపోయాడంటూ నిన్నటితరం క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కెరీర్ దెబ్బ తినడంతో కాంబ్లి తాగుడుకు బానిస అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆటను, ఆరోగ్యాన్ని పట్టించుకోక పూర్తిగా గాడి తప్పాడు.
ఆటగాడిగా కెరీర్ ఆగిపోయిన వాళ్లు కూడా కోచింగ్ కెరీర్లోకి వెళ్లి మంచి స్థాయిని అందుకున్నారు. ఐపీఎల్ వల్ల మాజీ క్రికెటర్లందరికీ మంచి ఉపాధి దొరికింది. కానీ కాంబ్లికి క్రమశిక్షణ లేక, తాగుడుకు బానిసై పూర్తిగా దెబ్బ తిన్నాడు. అతను ఆర్థికంగా కూడా దివాళా తీసినట్లు తెలుస్తోంది. సచిన్ తర్వాత అంతటి స్థాయి అందుకుంటాడనుకున్న క్రికెటర్ ఇప్పుడీ స్థితికి చేరడం విచారకరం. ప్రతిభ ఉంటే సరిపోదు, మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరం అనడానికి ఇది రుజువు.
This post was last modified on August 6, 2024 9:48 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…