Trends

దేశంలో ఫ‌స్ట్ టైమ్‌.. పీఎంపై ప్రివిలేజ్ మోష‌న్!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అడ్డంగా బుక్క‌య్యారా? ఆయ‌న‌పై ఇప్ప‌టికే కారాలు మిరియాలు నూరుతున్న కాంగ్రెస్ స‌హా ఇత‌ర పార్టీల స‌భ్యుల‌కు మ‌రిన్ని ఆయుధాలు అందించారా? ఆయ‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్ వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్ల‌మెంటులో చోటు చేసుకున్న ప‌రిణామం.. త‌ర్వాత మోడీ స్పందించిన తీరు.. వంటివి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి నెల‌కొనేలా చేశాయి.

అస‌లేం జ‌రిగింది!

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడు, పార్ల‌మెంటలో విప‌క్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ద్మ‌వ్యూహం ప‌న్నార‌ని ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ని అన్నారు. కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఈ దేశాన్ని శాసిస్తున్నార‌ని చెప్పారు. మోడీ, అమిత్‌షా, అదానీ, అంబానీ, మోహ‌న్ భ‌గ‌వ‌త్ వంటి వారి పేర్ల‌ను రాహుల్ ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో తాము ఈ ప‌ద్మ‌వ్యూహాన్ని కుల గ‌ణ‌న ద్వారా భేదిస్తామ‌ని రాహుల్ ప్ర‌క‌టించారు. ప‌దే ప‌దే ఆయ‌న కుల‌గ‌ణన అంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌స‌భ‌లోనే స్పందిస్తూ.. కులం లేని వారు కుల గ‌ణ‌న గురించి మాట్లాడుతు న్నారు అంటూ రాహుల్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లు.. మంగ‌ళ‌వారం నాటి స‌భ‌లో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర పార్టీల నాయ‌కులు, స‌భ్యులు కూడా స‌భ‌లో విరుచుకుప‌డ్డారు. దీంతో రికార్డుల నుంచి మంత్రి చేసిన ఠాకూర్ వ్యాఖ్య‌ల‌ను తొల‌గిస్తున్నట్టు.. స్పీక‌ర్ స్థానంలో ఉన్న జ‌గ‌దాంబికా పాల్ ప్ర‌క‌టించి.. వాటిని తొల‌గించారు. ఇక్క‌డితో వివాదం స‌ర్దుమ‌ణిగింది. ఇరు ప‌క్షాలు శాంతించాయి. కానీ, ఆ త‌ర్వాతే క‌థ యూట‌ర్న్ తీసుకుంది.

మోడీ అత్యుత్సాహం!

లోక్‌స‌భ‌లో మంత్రి ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. ప్ర‌ధాని మోడీ.. ట్వీట్ చేశారు. దీనిలో ఆయ‌న ఠాకూర్ చేసిన కులం లేని వారు కుల‌గ‌ణ‌న కోరుతున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌శంసించారు. అంతేకాదు.. తప్ప‌ని స‌రిగా వినాల్సిన ప్ర‌సంగం అని పేర్కొన్నారు. అక్క‌డితో కూడా ఆగ‌లేదు. ఇండియా కూట‌మి చేస్తున్న మురికి రాజ‌కీయాల‌ను త‌న చ‌తుర‌త‌తో ముడిపెట్టి, హాస్యాన్ని క‌ల‌గ‌లిపి మంత్రి ఠాకూర్ చ‌క్క‌గా స్పందించార‌ని కూడా మోడీ పేర్కొన్నారు. అంతే.. ఈ వివాదం ఒక్క‌సారిగా తార‌స్థాయికి చేరింది.

స‌భా హ‌క్కుల తీర్మానం..

ప్ర‌ధాని మోడీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ స‌హా ఇండియా కూట‌మి పార్టీలు క‌త్తులు దూశాయి. త‌గునా? అంటూ.. నిల‌దీసి.. నిప్పులు చెరిగాయి. అంతేకాదు.. ప్ర‌ధానిపై ప్ర‌విలేజ్ మోష‌న్‌(స‌భా హ‌క్కుల తీర్మానం) ప్ర‌వేశ పెట్టాయి. దీనిని స్పీక‌ర్ తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీనిని కాంగ్రెస్ ఎంపీ చ‌ర‌ణ‌జిత్ సింగ్ చ‌న్నీ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. స్పీక‌ర్ దీనిని అనుమ‌తించారు. దీనిపై స‌మ‌యం కేటాయిస్తామ‌న్నారు.

ఏం జ‌రుగుతుంది?

ప్రివిలేజ్ మోష‌న్ అనేది లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో అత్యున్న‌త తీర్మానం. ఎవ‌రైనా ఎంపీ లేదా, మంత్రి స‌భా నియ‌మాల‌కు భంగం క‌లిగించినా.. స‌భా హ‌క్కుల‌కు విఘాతం క‌లిగించినా.. తోటి స‌భ్యుల‌ను అవ‌మాన ప‌రిచినా.. చ‌ర్య‌లు కోరుతూ.. చేప‌ట్టే తీర్మానం. దీనిపై స‌భ‌లో స‌మ‌యం అనేదే లేకుండా చ‌ర్చించేందుకు తీర్మానం ప్ర‌వేశ పెట్టిన ప‌క్షానికి మైకులు ఇస్తారు. ఇప్పుడు ఈ తీర్మానం.. ఏకంగా ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా ప్ర‌వేశ పెట్టారు. ఇది భార‌త పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ‌లో తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎన్ని రోజులైనా.. స‌భ‌ను న‌డిపించాల్సి వ‌స్తుంది. పైగా.. విప‌క్షానికే ఎక్కువ స‌మ‌యం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో మోడీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్‌ను తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఎస్పీ, ఆప్ వంటి ఇండియా కూట‌మి నాయ‌కులు తెర‌మీదికి తెచ్చారు. దీనికి కాంగ్రెస్ క‌నుక ఓకే అంటే.. ఈ విష‌యంపై నే స‌భ‌లో చ‌ర్చ‌సాగుతుంది. కులం లేని వాడు అంటూ.. రాహుల్‌ను గ‌తంలోనూ తిట్టిపోశారు. ఇప్పుడు పార్ల‌మెంటు వేదిక‌గా కూడా.. వ్యాఖ్యానించ‌డంతో పార్టీ సీరియ‌స్‌గా తీసుకుంది. మొత్తానికి మోడీకి వ్య‌తిరేకంగా మెజారిటీ ఎంపీలు ఓటేస్తే.. ఆయ‌నకు ఇబ్బందే. కొన్నాళ్ల‌పాటు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయొచ్చు.(చేయ‌రు. ఎందుకంటే.. వారి త‌ర‌ఫునే బ‌లం ఉంది) కానీ.. ఆయ‌న త‌న ప‌రువును పోగొట్టుకున్న‌ట్టు అవుతుంది.

This post was last modified on August 1, 2024 3:09 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

2000 కోట్లు ఎలా ఊహించుకున్నారు

కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…

58 mins ago

పుష్ప 2 సంగీతం – నేనే కాదు చాలా మంది చేస్తున్నారు

టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…

1 hour ago

వైన్ షాపులో బన్నీ.. ఎవరి కోసం?

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…

2 hours ago

మరణాన్ని వణికించే ‘డాకు మహారాజ్’

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…

2 hours ago

మెగా హీరో మళ్ళీ ట్రాక్ తప్పాడు

పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…

3 hours ago

బాలయ్య & బన్నీ – భలే భలే కబుర్లు

ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…

3 hours ago