Trends

నేపాల్‌లో కుప్ప‌కూలిన‌ విమానం.. 18 మంది మృతి!

భార‌త్ కు మిత్ర దేశం, పొరుగు దేశం కూడా అయిన నేపాల్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. దేశ రాజ‌ధాని ఖాఠ్మండులోని త్రిభువ‌న్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో టేకాఫ్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఓ విమానం కుప్ప కూలిపోయింది. క‌ళ్లు మూసి తెరిచే లోగా జ‌రిగిన ఈ విషాద ఘ‌ట‌న‌లో సిబ్బంది స‌హా 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. పైల‌ట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఖాఠ్మండు నుంచి పొఖారాకు బయల్దేరిన బాంబార్డియర్‌ సీఆర్‌జే 200 విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగి విమానం ద‌గ్ధ‌మైంది. శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో టేకాఫ్ అయింది. కానీ, ఇంత‌లోనే కుప్ప‌కూలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్‌ను విమానం నుంచి బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాదానికి కార‌ణ‌మేంటి?

నేపాల్‌లో చోటు చేసుకున్న విమాన ప్ర‌మాదం ‘టేబుల్‌ టాప్‌’ గా పేర్కొనే రన్‌వే నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇలాంటి ర‌న్‌వేల‌పై టేకాఫ్‌.. సంక్లిష్టంగా ఉంటుంద‌ని నిపుణులు తెలిపారు. టేబుల్ టాప్‌.. అని పేరులో ఉన్న‌ట్టుగానే.. భూభాగం కంటేఎత్తులో ఈ ర‌న్‌వేలు ఏర్పాటు చేస్తారు. ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. దీంతో విమానాల‌ను టేకాఫ్ చేసేప్పుడు.. ల్యాండింగ్ చేసేప్పుడు కూడా.. పైల‌ట్‌లు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

టేబుల్ టాప్ రన్ వేల‌పై నిర్ణీత ప్రాంతంలోనే విమానాలు ప్ర‌యాణించాలి. ఒక్క అడుగు ముందుకు వెళ్లినా.. వెన‌క్కి వెళ్లినా.. అదుపు త‌ప్పుతాయి. తాజా ఘ‌ట‌న‌లో విమానం టేకాఫ్ అయిన‌ప్పుడు.. నిర్ణీత మార్కింగ్‌ను దాటి ముందుకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అందుకే.. కింద స‌రైన ఎత్తులేక పోవ‌డంతో విమానం కూలిపోయి ఉంటుంద‌ని చెబుతున్నారు. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.

This post was last modified on July 24, 2024 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

12 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

48 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago