ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ భారతీయులు ఉంటారు. అందునా తెలుగోళ్లు కూడా కనిపిస్తారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో మాత్రం తెలుగోళ్లు పాతుకుపోవటమే కాదు.. వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన ఎనిమిదేళ్లలో తెలుగువారి జనాభా ఏకంగా నాలుగు రెట్లు పెరిగిన ఆసక్తికర విషయం అమెరికా సెన్సస్ బ్యూరో రిపోర్టు స్పష్టం చేసింది. సదరు నివేదిక ప్రకారం 2016లో అమెరికాలో 3.2 లక్షలమంది తెలుగువారు ఉండగా.. 2024 నాటికి వారి సంఖ్య 12.3 లక్షలకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు.
కాలిఫోర్నియాలో 2 లక్షల మంది.. టెక్సాస్ లో 1.5 లక్షలు.. న్యూజెర్సీలో 1.1 లక్ష్లు.. ఇల్లినాయిస్ లో 83 వేలు.. వర్జీనియాలో 78 వేలు.. జార్జియాలో 52 వేల మంది తెలుగు వారున్నట్లు లెక్కలు తేలాయి. ప్రతి ఏటా 60 నుంచి 70 వేల మంది విద్యార్థులు తెలుగు వారు ఉన్నారు. ఇక.. అమెరికాకు వెళ్లే భారతీయుల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఏటా 10 వేల మంది తెలుగువారు హెచ్ 1బీ వీసా మీద అమెరికాకు వెళుతున్నారు.
అమెరికాకు వెళ్లిన తెలుగువారిలో 75 శాతం మంది స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అమెరికాలో కొన్ని నగరాల్లో తెలుగువారి సంఖ్య భారీగా ఉంది. అలాంటి నగరాల్లో డల్లాస్.. బే ఏరియా.. నార్త్ కరోలినా.. న్యూజెర్సీ.. అట్లాంటా.. ఫ్లోరిడా.. నాష్ విల్లే లు ఉన్నాయి. అమెరికాలో మొత్తం 350 విదేశీ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అన్ని వందల భాషల్లో అత్యధికంగా మాట్లాడే ప్రజల భాషలో తెలుగు పదకొండో స్థానంలో ఉండటం విశేషం. అంతేకాదు.. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. హిందీ.. గుజరాతీల కంటే ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లుగా గుర్తించారు.
అమెరికాలో తెలుగోళ్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది.వేర్వేరు భాషలకు సంబంధించిన వారిలో తెలుగోళ్లు 11వ స్తానంలో నిలిచారు.అదెంత ఎక్కువన్న విషయాన్ని తాజా అందుబాటులోకి వచ్చిన గణాంకాలతో మరింత తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. 2010లో తెలుగు మాట్లాడేవారు 2.17 లక్షలు ఉంటే.. 2021 నాటికి వీరి సంఖ్య 4.59 లక్షలకు చేరుకుంది. అంటే.. 111 శాతం పెరుగుదల ఉన్నట్లుగా చెప్పాలి. తెలుగు తర్వాత అత్యధికంగా మాట్లాడే భారతీయ భాష తమిళంగా నిలిచింది. 2010లో తమిళం మాట్లాడే వారి సంఖ్య 1.81 లక్షలు ఉంటే.. 2021నాటికి వీరి సంఖ్య 3.41 లక్షలుగా నమోదైంది. వీరి పెరుగుదల 88శాతంగా నమోదైంది.
వేగంగా పెరుగుదల నమోదు అవుతున్న భాషల్లో తెలుగు, తమిళం తర్వాతి స్థానాల్లో బెంగాలీ.. నేపాలీ..ఇండో -ఆర్యన్ భాషలు ఉన్నాయి. ఆ తర్వాతే హిందీ ఉండటం గమనార్హం. మళయాళం, కన్నడ, ఇతర భాషల తర్వాతే ఉర్దూ నిలిచింది. ఇక.. పంజాబీ.. గుజరాతీ భాషలు చివర్లో ఉండటం గమనార్హం. ప్రతి ఏడాది అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల్లో తెలుగువారి వాటా 13 శాతం. ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్యలోనూ తెలుగువారు ఎక్కువగా ఉంటున్నారు.
This post was last modified on June 28, 2024 11:58 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…