Movie News

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్ 150తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాక రికార్డుల పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నది వాల్తేర్ వీరయ్య ఒక్కటే. సైరా నరసింహారెడ్డి భారీ రెవిన్యూ చూసినా ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేదు.

గాడ్ ఫాదర్ కంటెంట్ కు మెప్పులు వచ్చాయి కానీ అనుకున్న స్థాయిలో డబ్బులు రాలేదు. ఇక ఆచార్య, భోళా శంకర్ గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. ఇవన్నీ పది ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నిన్నటి తరం దర్శకులు హ్యాండిల్ చేసినవి. పొరపాటు ఇక్కడ జరుగుతోందని చిరు గుర్తించిన్నట్టున్నారు.

క్రమంగా ట్రాక్ రెకార్డున్న ఇప్పటి డైరెక్టర్లతోనే చేతులు కలుపుతూ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. విశ్వంభర తీస్తున్న వశిష్టకు ఇదింకా రెండో సినిమానే. టీజర్ మీద కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ విఎఫెక్స్ మీద మళ్ళీ రీ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని ఇన్ సైడ్ టాక్.

తీసిన ఎనిమిది చిత్రాల్లో అపజయమే ఎరుగని అనిల్ రావిపూడితో మెగా టైఅప్ కావడం ఫ్యాన్స్ అంచనాలను ఇప్పటి నుంచే పెంచుతోంది. కేవలం అనౌన్స్ మెంట్ తోనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు మీద హైప్ వచ్చింది. మొదలుపెట్టడానికి ఇంకా చాలా టైం ఉన్నా అప్పుడే టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.

మరోసారి బాబీ కాంబో రిపీట్ చేయాలని చిరు నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వాల్తేరు వీరయ్యలో తనను బాగా ప్రెజెంట్ చేయడంతో పాటు ఇటీవలే డాకు మహారాజ్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వైనం ఇంకో కథను సిద్ధం చేసే దిశగా పురమాయించిందట. ఇప్పుడీ ఇన్నింగ్స్ లో ఎంచుకుంటున్న దర్శకులందరూ కొత్త జనరేషనే.

సక్సెస్ ఫామ్ లో ఉన్నవాళ్లే. సరైన కంటెంట్ తో మెప్పించగలిగితే మాత్రం వింటేజ్ చిరంజీవిని చూడొచ్చు. ఆయన కోరిక కూడా అదే. ఈ లెక్కన రాబోయే రెండేళ్లు చిరు డైరీ నిండిపోయేలా ఉంది. సబ్జెక్టు కుదిరితే భవిష్యత్తులో వెంకీ అట్లూరికి కూడా ఛాన్స్ దక్కనుంది.

This post was last modified on January 22, 2025 7:46 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago