రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ఏం చేసినా చెల్లుతుంది. కానీ, అధికారంలోకి వచ్చాక.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం.. సొంత దేశానికి చేటు తేవడం ఖాయమని అంటున్నారు అదే దేశానికి చెందిన ఆర్థిక నిపుణులు.
అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, అసలు వలసలపైనే ప్రభావం చూపించేలా.. నిర్ణయం తీసుకోవడం, బై బర్త్ గ్రీన్ కార్డు ఫెసిలిటీని ఎత్తేయడం.. వంటివి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ప్రధానంగా భారత్, చైనా, మెక్సికో సహా అనేక దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఒక్క మెక్సికో నుంచి మాత్రమే అక్రమ వలసలు జరుగుతున్నాయన్నది వాస్తవం. ఇక్కడ అడ్డుకట్ట వేసేందుకే ఇదే ట్రంప్ గతంలో మెక్సికో చుట్టూ గోడ కట్టించారు.
దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. ఖజానా ఖాళీ అవుతున్నా అప్పట్లో ట్రంప్ పట్టించుకోలేదు. అయినప్పటికీ.. వలసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు మొత్తానికే ఎసరుపెడుతూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇలా వలసలను, బై బర్త్ సిటిజన్ షిప్‌ను నిలిపి వేయడం వల్ల దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మా దేశానికి ఇమ్మిగ్రేషన్ ఆదాయం ఎక్కువ. ఇతర ఆదాయాలకంటే ఎక్కువగా వస్తోంది. ఇప్పుడు దీనిపై ప్రభావం చూపించేలా నిర్ణయం తీసుకుంటే అది మరింత నష్టం” అని ఆర్థిక నిపుణుడు రిచర్డ్ హెచ్చరించారు.
కాగా.. అమెరికాకు ఏటా వివిధ రూపాల్లో వచ్చే ఆదాయంలో వీసాలు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా 28 శాతం ఆదాయం సమకూరుతోంది. ఇది కీలకమైన ఐటీ, పారిశ్రామిక రంగాలతో పోల్చుకుంటే 2 శాతం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా.. దీనివల్ల నష్టం లేదని కూడా అంటున్నారు. ఇదేసమయంలో అక్రమ వలసలపై ఆందోళన ఉందని చెబుతున్నారు. దీనిని నిలుపుదల చేసేందుకు ఇలాంటి నిర్ణయం సరికాదంటున్నారు.
మరోవైపు భారత ఆర్థిక నిపుణులు కూడా.. ట్రంప్ నిర్ణయం అమెరికాను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతుందని పేర్కొంటూ.. గతంలో కరోనా సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరును వారు ప్రస్తావిస్తున్నారు. అప్పట్లోనూ మొండిగా వ్యవహరించి.. కరోనా దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేశారని వారు చెబుతున్నారు.
This post was last modified on January 22, 2025 2:19 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…