కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ రిలీజైనప్పుడు జనం ఎగబడి చూస్తారు. మన తెలుగులో ఆ మధ్య ఆరంజ్, ఓయ్ కొచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. ఇదేదో అసలు విడుదల టైంలో జరిగి ఉంటే నిర్మాతలు లాభాలు చూసేవాళ్లని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడిది హాలీవుడ్ మూవీస్ కి కూడా వర్తిస్తోంది. పది సంవత్సరాల క్రితం 2014లో వచ్చిన ఇంటర్ స్టెల్లార్ ఒక అద్భుతం. క్రిస్టోఫర్ నోలన్ అపారమైన మేధాశక్తికి ఒక నిదర్శనం. అయితే దీనికి కనెక్ట్ అయిన వాళ్ళ కన్నా కంటెంట్ పట్ల కన్ఫ్యూజ్ అయిన బ్యాచులే ఎక్కువ.
సరే ఎవరి కోణం వారిదిలే కానీ టెన్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటర్ స్టెల్లార్ ని ఇండియాలో ఫిబ్రవరి 7 మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇప్పటిదాకా 80 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం అసలు ట్విస్టు. ఒక్క హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులోనే 10 వేలకు పైగా కొనేశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇంటర్ స్టెల్లార్ ని ఆస్వాదించాలంటే పెద్ద ఐమాక్స్ స్క్రీన్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉండాలి. వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆడియన్స్ వెతికి మరీ అలాంటి సౌకర్యాలు ఉన్న థియేటర్లలో బుక్ చేసుకుంటున్నారు.
వాడాలాలో ఉన్న ఐమాక్స్ తెరపై ఇరవై నాలుగు గంటల పాటు ఏకధాటిగా ఇంటర్ స్టెల్లార్ నే ప్రదర్శించేందుకు నిర్ణయించుకోవడం దీని క్రేజ్ కు చిన్న మచ్చుతునక. కేవలం ఏడు రోజుల పాటే ఇంటర్ స్టెల్లార్ మన దేశంలో స్క్రీనింగ్ చేస్తారు. ఆలోపు చూసేయాలి. అయినా ఓటిటి, ఆన్ లైన్ కాలంలో ఇంతగా ఎగబడి చూసేందుకు ఏముందబ్బా అంటే అది లైవ్ గా ఎక్స్ పీరియన్స్ అయితే తప్ప చెప్పలేమంటున్నారు మూవీ లవర్స్.
ఇంకో విశేషం ఏంటంటే 2014లో ఫస్ట్ రిలీజప్పుడు ఇంటర్ స్టెల్లార్ $681 మిలియన్లు వసూలు చేస్తే తర్వాత పలు దఫాల రీరిలీజుల ద్వారా $743 మిలియన్లు కలెక్ట్ చేసింది. అందుకే కల్ట్ అనేది.
This post was last modified on January 22, 2025 10:40 am
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…