తెలంగాణలో బీర్లకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గత నెల నుంచి ఇదే కొనసాగుతోంది. మందు బాబులకు ఎంతో ప్రియమైన బ్రాండ్స్ అయితే.. అసలు అందుబాటులో కూడా లేక పోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త బ్రాండ్లు గతంలో ఎన్నడూ రుచిచూడని కావడం విశేషం. మరోవైపు బీర్లకు కొరత ఏర్పడడంతో బ్లాక్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి సమ్మర్ సీజన్‌లో తెలంగాణ ప్రాంతంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కూడా.. అదే పరిస్థితి నెలకొనడంతో బీర్లకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. అయితే.. ఇది సర్కారు ఖజానాపైనా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సామ్ డిస్టిలరీలకు బీర్లను వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో సంస్థ.. సరికొత్త బీర్లను మార్కెట్‌లోకి తసుకువచ్చి.. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఉంచింది.
ఈ పరిణామం.. రేవంత్ రెడ్డి సర్కారుపైనా.. ముఖ్యంగా సీఎంపైనా విమర్శలు వచ్చేలా చేసింది. కొత్త బ్రాండ్లకు అనుమతించడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు. 2019లో ఏపీ సీఎం జగన్ ఇలానే చేశారంటూ.. దుయ్యబడుతున్నారు. అయితే.. ఏపీకి , తెలంగాణకు తేడా ఏంటంటే.. అక్కడ కొత్తగా బ్రాండ్లను తయారు చేసి విక్రయించారు. కానీ, తెలంగాణలో మాత్రం ఉన్న బ్రాండ్లను కొత్తగా మార్కెట్‌లో కి తీసుకువచ్చారు.
అంతేకాదు.. ఏపీలో ఉన్న మాదిరిగా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటివి తెలంగాణలో లేకపోవడం గమనార్హం. అవి కేవలం ఏపీకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్రాండ్లు మాత్రం ఇప్పటికే కొన్న రాష్ట్రాల్లోని హోటళ్లలో అందుబాటులో ఉన్నాయి. పైగా అవి అక్కడవిరవిగా వినియోగిస్తున్న బ్రాండ్లు కావడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 9:28 pm
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…