అది సంగీత విభావరి జరుగుతున్న సమయం. గాయకులు తన్మయత్వంతో గీతాలను ఆలపిస్తున్నారు. వీక్షకులు.. మంత్ర ముగ్ధులై.. గాయకుల సంభ్రమలో మునిగి.. సంగీతంలో ఓలలాడుతున్నారు. ఇలా.. సాగుతున్న సంగీత కచేరీలో అకస్మాత్తుగా.. బాంబుల వర్షం… మారణ కాండ.. రక్తపుటేరులు. ఎటు చూసినా.. పదుల సంఖ్యలో మృతదేహాలు కన్నుమూసి తెరిచేలోగా.. ఏం జరిగిందో కూడా తెలియనంతగా భీతావహ దృశ్యాలు.. ఇవీ.. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మారణకాండ తాలూకు పరిస్థితి.
రష్యా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి పగ్గాలు చేపట్టిన పుతిన్.. రెండు రోజులు కూడా గడవకముందే.. భయంకరమైన పరిస్థితిని చవి చూడాల్సి వచ్చింది. దేశంలో ఇప్పటి వరకు జరగని రీతిలో దారుణ మారణకాండ చోటు చేసుకుంది. ఒక్క పెట్టున వచ్చిన ఉగ్రవాదులు క్రాకస్ సిటీ కన్సర్ట్(సంగీత విభావరి)లో మారణకాండను సృష్టించారు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది.
ఏం జరిగింది?
ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్‌నిక్’ ఏటా నిర్వహించే వార్షిక సంగీత విభావరిని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇది మంచి రసపట్టులో ఉంది. గాయకుల గీతాలకు వీక్షకులు.. మంత్రుముగ్ధులై ఓలలాడుతు న్నారు. ఇంతలో హఠాత్తుగా భవనంలోనికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సాయుధులు కాల్పులు జరపడం, పలువురు భయాందోళనలతో ఘటనాస్థలం నుంచి పారిపోతుండడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఉగ్రవాదుల దాడితో భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. ఐదుగురు సాయుధులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడి తామే చేసినట్లు ‘ఇస్లామిక్ స్టేట్’ ప్రకటించుకుంది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 2002లో చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్‌లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు.
This post was last modified on March 23, 2024 10:55 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…