ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన కేబినెట్లోని మాజీ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసు నమోదైనప్పుడే.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఇది కేసే కాదని.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని.. దీనిలో ఎవరికీ మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పానని.. కానీ, ఆనాడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని కేజ్రీవాల్ అన్నారు.
అంతేకాదు.. తనను అక్రమార్కుడిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. “నిజం ఇప్పటికి బయటకు వచ్చింది. కానీ, జరగాల్సిన అన్యాయం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు మాకు సమాధానం చెబుతారు? ప్రజలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి.“ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఊరేగింపుగా కేజ్రీవాల్‌ను తన నివాసానికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియా ముందు మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజల్లోనూ తమ పరువు పోయేలా వ్యవహరించారని తెలిపారు. తనతోపాటు.. ఐదుగురు మంత్రులను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. కానీ, నిజాలు ఎప్పుడూ బయటకు వస్తాయని.. కాకపోతే తమ విషయంలో మరింత ఆలస్యమైందని అన్నారు. ఇప్పటికైనా కోర్టు తమను నిర్దోషులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.
దర్యాప్తు సంస్థలకు తమకు నచ్చినట్టుగా.. తమ ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీల పరువు ఇప్పుడు పోయిందని.. ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. రాజకీయ వేధింపులకు.. సంస్థలను వినియోగించుకుంటున్న మోడీ, షాలు కళ్లు తెరవాలని, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనాలని.. దొడ్డిదారిలో కేసులు పెట్టడం సరికాదని అన్నారు.
This post was last modified on February 27, 2026 3:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…