ఉక్రెయిన్‌తో యుద్ధం.. ప్రపంచం మాట వినని తెంపరితనం.. నా ఇష్టం నాదే అనే గడుసు తనం.. వెరసి అప్రకటిత నియంతృత్వానికి పోతపోసినట్టు ఉండే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కే అక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆయనకు ఓట్ల వర్షంకురిసింది. తాజాగా మూడు రోజుల పాటు సాగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపిం ది.
మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన రష్యా ఎన్నికల్లో మొత్తం 74.22 శాతం పోలింగ్ నమోదైంది. అందులో పుతిన్కు అత్యధికంగా 88శాతం ఓట్లను లభించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పుతిన్కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్ 4.8 శాతం, మరో అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ 4.1 శాతం, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీకి 3.15 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పుతిన్ విజయం ఏకపక్షంగా సాగిపోయింది.
ఇటీవల అనుమానాస్పద రీతిలో జైలులోనే మృతి చెందిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మద్దతు దారులు పుతిన్‌కు వ్యతిరేకంగా.. నావల్నీకి సానుభూతిగా విస్తృతంగా ప్రచారం చేశారు. వీరికితోడు దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే.. ఈ సింపతీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎన్నికలకు ముందు వరకు కూడా పుతిన్ అంటే.. రష్యా నియంత అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కానీ, పుతిన్‌తో పోలస్తే.. బలమైన నాయకుడు ఎన్నికల్లో కనిపించకపోవడం, దేశాన్ని కొన్ని విషయాలు మినహా అన్నింటా ముందుకు తీసుకువెళ్లడంలో పుతిన్ బలమైన నేతగా ఎదగడంతో ఆయన విజయం ఏకపక్షంగా మారిపోయింది. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం పుతిన్ దాదాపు 88 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 దశల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 71 ఏళ్ల పుతిన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
This post was last modified on March 18, 2024 2:12 pm
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…