యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
సచిన్ కూతురు సారాతో అతను ప్రేమలో ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో కూడా అతడికి లింక్ కలుపుతుంటారు. వీళ్లిద్దరూ దుబాయ్‌లో ఒక రెస్టారెంట్లో కనిపించడమే అందుక్కారణం. అందరూ సచిన్ తనయురాలు సారాతో శుభ్‌మన్ ప్రేమలో ఉన్నాడనుకుంటున్న సమయంలోనే ఆ ఫొటో వైరల్ అయింది.
ఐతే కాఫీ విత్ కరణ్ షోకు అతిథిగా వచ్చిన సారా అలీ ఖాన్.. శుభ్‌మన్‌తో ఎఫైర్ గురించి జరిగే ప్రచారంపై మాట్లాడింది. ఆమె సింపుల్‌గా ఆ సారా నేను కాదు.. అని చెప్పడం విశేషం. శుభ్‌మన్ గిల్‌తో నువ్వు డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దానిపై నీ అభిప్రాయం ఏంటి అని కరణ్ అడగ్గా.. ‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’’ అని సారా అలీ ఖాన్ అంది.
తనకు, శుభ్‌మన్‌కు మధ్య ఏమీ లేదని చెబుతూనే.. అతను సచిన్ కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పింది సారా అలీ ఖాన్. సచిన్ కూతురు గురించి పరోక్షంగా మాట్లాడాలన్నా చాలా ఆలోచించాల్సిందే. ఆమె మాటల్ని బట్టి చూస్తే శుభ్‌మన్, సారా టెండూల్కర్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకోవాలి. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా సారా హాజరవడం.. శుభ్‌మన్ ఇన్నింగ్స్‌లు చూస్తూ ఉత్సాహంగా కనిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2023 3:05 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…