Trends

రీల్ కోసం పోలీస్ జీప్ ను వాడేసింది.. తర్వాతేమైంది?

సోషల్ మీడియాలో తాము ఫేమస్ కావాలన్న తపనతో కొందరు చేస్తున్న అతి.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ముందువెనుకా చూసుకోకుండా వారు చేసే పనులకు.. వారి మాయలో పడిన అధికారులకు దిమ్మ తిరిగే షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే పంజాబ్ లో చోటు చేసుకుంది.

ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఒక పోలీసు అధికారి మీద వేటు పడింది. అతగాడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సదరు అధికారిని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ఇన్ స్టా ఇన్ ఫ్లెయెన్సర్ అయితే మాత్రం.. తమ వద్దకు వచ్చిన ప్రతి దానికి ఓకే అనటం సరికాదు. ఇన్ స్టాలో రెగ్యులర్ గా రీల్స్ చేసే ఒక యువతి జలందర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి.. పోలీసుల వాహనాన్ని తన తాజా రీల్ కోసం వాడేసింది.

పోలీసు వాహనం బాయినెట్ మీద విలాసంగా కూర్చున్న ఆ యువతి.. పాపులర్ పంజాబీ బీట్ ఘయింట్ జట్టికి డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె హావభావాల మీద విమర్శలు వెల్లువెత్తాయి. తాను పాపులర్ కావటం కోసం పోలీసు జీపును వాడుకోవటానికి అనుమతిచ్చిన అధికారుల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. తన వీడియో చివర్లో సదరు యువతితో పాటు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా ఉండటం.. వారి మధ్యన ఏదో సంభాషణ జరగటం.. చివర్లో ఆమె నవ్వుతూ వాహనంలోకి ఎక్కటంతో వీడియో ముగుస్తోంది.

ఈ వీడియో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. జలంధర్ స్టేషన్ హౌస్ అధికారి అశోక్ శర్మను సస్పెండ్ చేస్తూ జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక అంశాలకు బదులుగా.. షోకు కోసం చేసే ఈ తరహా పనులకు ఈ మాత్రం మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.

This post was last modified on September 30, 2023 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐకాన్ స్టార్ ముద్దు – కండల వీరుడు వద్దు

జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…

1 hour ago

అన్నీ ఓకే.. మరి సమన్వయం మాటేమిటి?

అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…

1 hour ago

లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…

2 hours ago

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…

2 hours ago

పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ యాత్ర షురూ!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ యాత్ర బుధవారం మొదలై పోయింది. కొన్ని…

2 hours ago

ఆప‌రేష‌న్ ‘పులివెందుల’ స‌క్సెస్‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు పొలిటిక‌ల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయ‌కులు క‌న్నేశారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో…

3 hours ago