ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయన ప్రయాణించే వాహనాల సముదాయానికి తన కారును అడ్డంగా పెట్టేసిన ఒక వ్యక్తి వైనం ఆసక్తికరంగా మారితే.. అందుకు ఆ ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. పిలిపించుకొని.. సదరు వ్యక్తిని శాంతపరిచిన ఈ ఉదంతం ఇప్పుడు వార్తాంశంగా మారింది. అయితే.. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశమే లేదన్నది మర్చిపోకూడదు. కాకుంటే తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉండే కర్ణాటకలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ప్రముఖుల నివాసాలకు పక్కన ఉండే వారికి ఎదురయ్యే తిప్పలు అన్ని ఇన్ని కావు. కర్ణాటకకు మరోమారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య బెంగళూరు కుమార క్రప మార్గంలో నివాసం ఉంటారు. ఆయన ఇంటి పక్కనే పురుషోత్తమ్ అనే వ్యక్తి నివాసం ఉంటారు. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ధూను కలిసేందుకు పొద్దున్నే వచ్చేసే వారంతా.. తమ వాహనాల్ని పురుషోత్తం ఇంటి ముందు పెట్టేస్తుంటారు.
దీంతో.. ఆయన తెగ ఇబ్బందికి గురవుతుంటారు. ఒక రోజు తన కారును బయటకు తీసేందుకు కూడా ఛాన్స్ లేకుండా కార్లను అడ్డంగా పెట్టేశారు. దీంతో.. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని ఆయన చిర్రెత్తి సరిగ్గా సీఎం బయలుదేరే వేళ చూసుకొని.. తన కారును తీసుకొచ్చి కాన్వాయ్ కు అడ్డుగా పెట్టేశారు. దీంతో.. ఆ వాహనాన్ని పక్కకు తీసేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినలేదు.
అనూహ్యంగా ఏర్పడిన లొల్లితో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్దూ.. సదరు పక్కింటాయనను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆయనకు ఎదరవుతున్న అసౌకర్యం గురించి తెలుసుకొని.. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిన తర్వాతే పురుషోత్తం తన వాహనాన్ని అడ్డుతీయటం గమనార్హం. అదే..తెలుగు రాష్ట్రాల్లో అయితే.. సదరు కారు ఎక్కడికో వెళ్లిపోయేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on July 29, 2023 10:17 am
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…