Trends

షిర్డీ వెళ్తున్నాన‌ని చెప్పి.. స్నేహితుడి భార్య‌తో జంప్‌

వివాహేతర సంబంధాల‌కు వాటి వ‌ల్ల క‌లుగుతున్న ప‌ర్య‌వ‌సానాల‌కు ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలో వావి, వ‌రుస‌లు కూడా మ‌రిచిపోతున్నారు.. ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాలు స‌మాజం త‌ల‌దించుకునేలా చేస్తున్నా.. ఈ కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌వారు మాత్రం.. నిస్సిగ్గుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

మారేడుప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న్యూ బోయిన్‌ప‌ల్లిలో 45 ఏళ్ల‌ అతుల్ వ‌డ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే.. ఒక స్నేహితుడి ఇంటికీ త‌ర‌చుగా వెళ్లే అతుల్‌.. స‌ద‌రు స్నేహితుడి భార్య‌పై క‌న్నేశాడు. మెల్ల‌గా ముగ్గులోకి లాగాడు. అతుల్‌కు కూడా వివాహం అయింది. అయితే.. ఇంట్లో చెప్ప‌కుండానే స‌ద‌రు స్నేహితుడి భార్యంతో ప్రేమాయ‌ణం కొన‌సాగించాడు.

ఇక‌, ఈ విష‌యం స్నేహితుడికి కూడా తెలిసింది. మ‌రి ఆయ‌న ఏం చేశాడంటే.. మౌనంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు స్నేహితులకు మ‌ధ్య న‌గ‌దు లావాదేవీలు ఉన్నాయ‌ని స‌మాచారం. అందుకే.. త‌న భార్య‌తో స్నేహం ఏంట‌ని ప్ర‌శ్నిస్తే.. సంబంధిత న‌గ‌దు ఇవ్వాల‌ని ఒత్తిడి చేసే అవ‌కాశం ఉంద‌ని భావించాడో ఏమో.. త‌న భార్య‌తో అతుల్ స్నేహంగా ఉన్న‌ప్ప‌టికీ.. చూస్తూ ఉన్నాడు.

ఇదిలావుంటే.. తాజాగా అతుల్‌.. స్నేహితుడి భార్య‌తో జంప్ అయిపోయాడు. అయితే.. త‌న భార్య‌కు మాత్రం ప‌విత్ర షిర్డీకి వెళ్తున్నాన‌ని.. సాయినాథుడుని ద‌ర్శించుకుని వ‌స్తాన‌ని చెప్పాడు. దీంతో ఆఇల్లాలు.. భ‌ర్త చెప్పిన మాట‌ల‌ను న‌మ్మింది. కానీ, మరుసటిరోజు నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అయితే అతుల్‌ తన భార్యకు రాసిన లేఖ ఇంట్లో దొరికింది. అందులో తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తున్నానని, ఈ విషయం తన స్నేహితుడికి తెలుసునని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

దీంతో ప‌రుగు ప‌రుగున అతుల్ స‌తీమ‌ణి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న భ‌ర్త రాసిన లేఖ‌తో పాటు.. ఇంట్లో రూ.10 ల‌క్ష‌లు క‌నిపించ‌డం లేద‌ని తెలిపింది. దీంతో మారేడుపల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. స్నేహితుడు కావాల‌నే త‌న భార్య‌ను అతుల్‌తో పంపించాడా? త‌న అప్పులకు త‌న భార్య‌ను ఎర‌వేశాడా? అనేది తేలాల్సి ఉంది. ఇక‌, అతుల్ రాసిన లేఖ‌లో మ‌రో కీల‌క అంశం.. తమను వెతకవద్దని పేర్కొన‌డం.

This post was last modified on June 2, 2023 11:04 am

Share

Recent Posts

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

29 minutes ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

1 hour ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

4 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

5 hours ago