పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అందరూ ఊహించినట్టే బ్రో టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇందాకా అఫీషియల్ గా లాంచ్ చేసిన మోషన్ పోస్టర్ వీడియోలో పవన్ కళ్యాణ్ నిలుచుని రెండు చేతులు చాపి స్టయిలిష్ గా కిందకు చూసే స్టిల్ ని అందులో పొందుపరిచారు. టైటిల్ రోల్ పవన్ దే కాబట్టి ఈ బిట్ లో తేజుకు చోటు దక్కలేదు.
బ్యాక్ గ్రౌండ్ లో శివ దర్శనంతో పాటు తమన్ స్వరపరిచిన స్తోత్రంలో బ్రో సౌండ్ ని హైలైట్ చేస్తూ సంస్కృత శ్లోకాన్ని పఠించడం కొత్తగా ఉంది. మొత్తానికి బ్రో డిఫరెంట్ గా ఉండబోతున్నాడన్న సంకేతం దీని ద్వారా ఇచ్చారు. తొలుత కాలభైరవ టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఏవో కారణాల వల్ల ఫైనల్ బ్రో వైపే యూనిట్ మొగ్గు చూపింది.
ఫ్యాన్స్ నుంచి ముందు దీనికి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ వినగా వినగా ఇదే క్యాచీగా మారే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఒక్క అక్షరమే కాబట్టి బయట రాష్ట్రాల్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇలా సింగల్ తెలుగు అక్షరంతో పవన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఇంగ్లీష్ లో మాత్రం మూడు ఆల్ఫాబెట్స్ వస్తాయి . త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చారు. వినోదయ సితం రీమేక్ గా రూపొందుతున్న బ్రోలో పవన్ కళ్యాణ్ పాత్ర కాలాన్ని శాసించే దైవం రూపంలో ఉంటుంది.
ఒక మధ్యతరగతి ఉద్యోగి జీవితంలో ప్రవేశించిన ఇతన్ని సాయి తేజ్ పాత్ర బ్రో అని పిలుస్తాడు. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలుసుకున్నారు విధి ఆడిన వింత ఆటలో ఎవరి పాత్ర ఎంత లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా బ్రో విడుదల కానుంది. పవన్ కి హీరోయిన్ ఉండని రెండో సినిమా ఇది. గోపాల గోపాల ఫార్మాట్ నే బ్రోకు ఫాలో కాబోతున్నారు. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ల నుంచి అభిమానుల ఫోకస్ బ్రో పైకి వెళ్లనుంది
This post was last modified on May 18, 2023 5:36 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…