అమెరికాలో కాల్పులు. ఈ మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. 24 గంటల కిందటే.. అమెరికాలో కాల్పులు జరిగి.. 9 మంది మృతి చెందిన దుర్ఘటన.. ప్రపంచాన్ని వణికించేలా చేసింది. ఇంతలోనే.. మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్‌ను టార్గెట్ చేసుకుంటున్న దుండగులు.. పిట్టలను కాల్చినట్టు మనుషులను కాల్చేస్తున్నారు. ఇదేదో.. సరదా.. అనుకుంటున్నారో.. మరేమో.. తెలియదు కానీ.. ఒకరిద్దరు చేస్తున్న దారుణాలతో కుటుంబాలకు కుటుంబాలే కన్నీరు పెడుతున్నాయి.
అయితే.. అమెరికాలో జరుగుతున్న ఈ దుండగుల విచ్చలవిడి కాల్పుల వెనుక.. బైడెన్ సర్కారు నిర్వాకమే ఉందని అక్కడి మీడియా కోడై కూస్తోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. కరోనా అనంతరం తలెత్తిన ఆర్థిక పరిస్థితులను బైడెన్ ప్రభుత్వం.. సరిగా డీల్ చేయలేక పోయింది. దీంతో ఆర్థిక మాంద్యం తలెత్తిందని వారు చెబుతున్న మాట. ఫలితంగా అనేక ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది.
ఇలా.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగాలు కూడా దక్కడం లేదని.. మీడియా చెబుతోంది. ప్రస్తుతం అమెరికా నిరుద్యోగత 40 శాతం ఉందని అంచనాలు వేశారు. ట్రంప్ హయాంలో 25 శాతం ఉన్న నిరుద్యోగత.. ఇప్పుడు 15 శాతం పెరిగిందని.. చెబుతున్నారు. ఇక, ఆర్థికంగా పెట్టుబడులు కూడా అమెరికాకు మందగించాయి. దీనికి తోడు.. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయి.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఉక్రెయిన్‌ను మద్దతిస్తున్నందున.. రష్యా పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లిపోయారు.
దీంతో అమెరికాలో ఆర్థిక పరిస్థితి తీవ్ర మందగమనంలో ఉందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. అమెరికాలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని.. అందుకే..యువత దారి తప్పుతున్నారని అంటున్నారు. చిత్రంగా అమెరికాలో ఏడాదికాలంగా మానసిక కౌన్సిల్ కేంద్రాలు హౌస్ ఫుల్‌గా నడుస్తున్నాయి. అంటే..దాదాపు 80 శాతం మంది అమెరికన్లు ఆర్థిక, వుద్యోగ పరమైన ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కాల్పులు పెరిగిపోయాయని అక్కడి మీడియా చెబుతుండడం గమనార్హం.