పాకిస్థాన్ పురుషులు ఉమ‌నైజ‌ర్లు.. బ్రిట‌న్ హోం మంత్రి

పాకిస్థాన్ పౌరుల‌పై బ్రిట‌న్ హోం శాఖ మంత్రి సుయెల్లా బ్రావ‌ర్మ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బ్రిట‌న్‌లో స్థిర‌పడిన పాకిస్థాన్ పురుషులు మామూలోళ్లు కార‌రంటూ.. ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బ్రిట‌న్ మ‌హిళ‌ల‌పై పాకిస్థానం సంత‌తి పురుషులు.. వేధింపులకు పాల్ప‌డుతున్నార‌ని.. అత్యాచారాల‌కు సైతం ఒడిగ‌డుతున్నార‌ని ఆమె తెలిపారు.

అంతేకాదు.. బ్రిట‌న్ లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగంలోనూ పాకిస్థాన్ సంత‌తి పురుషులే ఎక్కువ‌గా ఉంటున్న‌ట్టు బ్రావ‌ర్మ‌న్ పేర్కొన్నారు. పాక్ సంతతి పురుషులు దేశంలో రెచ్చిపోతున్నారని ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు, బ్రిట‌న్‌ యువతులను లక్ష‍్యంగా చేసుకుని వీరు అకృత్యాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని పేర్కొన్నారు.

బ్రిట‌న్‌కు చెందిన‌ అమ్మాయిలు, పిల్లలను ఇక్క‌డ ఉంటున్న పాకిస్థాన్ సంత‌తి పురుషుల ముఠాల వేధిస్తున్నాయని తెలిపారు. యువ‌తుల‌ను వెంబడించి అత్యాచారం చేయడం, మత్తుపదార్థాలు ఇవ్వడం, హాని చేయడం వంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నార‌ని చెప్పారు. నిందితుల‌కు పెద్ద నెట్‌వర్క్ ఉందన్నారు. అధికారులు.. వీరిని క‌ఠినంగా శిక్షించాల‌ని బ్రావ‌ర్మ‌న్ కోరారు.

అదేస‌మ‌యంలో బాధితులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనో లేక భయంతోనో, జాత్యహంకారం, మతోన్మాదం అనుకుంటారనో అధికారులు వీరిని గుడ్డిగా వదిలేస్తున్నారని బ్రావ‌ర్మ‌న్ ఆందోళ‌న వ్య‌క్తి చేశారు.

బ్రిట‌న్‌లో నివ‌సిస్తున్న పాకిస్థాన్ పురుషులు.. ఈ దేశ సంప్ర‌దాయాల‌కు.. సంస్కృతుల‌కు కూడా ఏమా త్రం విలువ ఇవ్వ‌డం లేద‌ని బ్రావ‌ర్మ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. స్త్రీలను అవమానిస్తున్నార‌ని తెలిపారు. ఇదిలావుంటే.. పిల్లలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేరస్థుల ముఠాల ఆట‌క‌ట్టించేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. మొత్తానికి పాకిస్థాన్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింద‌నే వాద‌న వినిపిస్తోంది.