మొబైల్ ఫోన్లు ఎన్ని ఉంటే మాత్రం.. ఐఫోన్ తర్వాతే ఏదైనా. ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరుగా ఉంటాయని చెబుతారు. దేశంలో కోట్లాది ఐ ఫోన్ మొబైళ్లు అమ్మడవుతున్నా.. అవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవని.. దేశీయంగా తయారు చేసిన ఐఫోన్లు ప్రజల చేతికి రాబోతున్నాయి. ఈ శుభవార్తను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా వెల్లడించారు.
2019లో ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ అసెంబ్లింగ్ యూనిట్ ను షురూ చేసింది. బెంగళూరుకు సమీపంలోని ఫ్లాంట్ సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐఫోన్ 11ను తయారీకి సంబంధించి దేశంలో కొత్త ప్లాంట్ రెఢీ అయ్యింది. ఈ లక్కీ ఛాన్సును ఏపీకి పొరుగునే ఉండే తమిళనాడు సొంతం చేసుకుంది.
అమెరికా – చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ భారత్ లో ఉత్పత్తి షురూ చేయాలని డిసైడ్ చేయటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఐఫోన్ మేడిన్ ఇండియానే కాదు.. మేకిన్ తమిళనాడు అన్న ట్యాగ్ లైన్ ఐఫోన్ కు యాడ్ కానుంది.
ఇప్పటికే దేశంలో పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్.. షావోమి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ తమిళనాడుకు వస్తున్న వైనం ఆ రాష్ట్ర వాసులకే కాదు.. దేశ వాసులకు సైతం స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.
This post was last modified on July 26, 2020 9:23 pm
సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం…
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు తనపై మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఫైర్ అవుతోంది. అసలు తాను అనని…
తాటిపర్తి చంద్రశేఖర్… వైసీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. విద్యాధికుడు అయిన ఈయన ప్రకాశం…
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే..…
ఏపీ సీఎం చంద్రబాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య పర్యటన…
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…