కరోనా టైంలో ఎలాంటి మాస్కులు వాడాలన్న సందేహం చాలామందిని పట్టి పీడించింది. దీనికి సమాధానంగా ఎన్ 95 మాస్కులు వాడితే మంచిదన్న మాట పలువురి నోట వినిపించింది. అంతేనా.. ఎన్ 95 మాస్కు.. మాస్కులకే మొనగాడని.. దాన్ని వాడితే రక్షణకు ఏ మాత్రం తేడా ఉండదని చెప్పారు. అంతేనా.. ఎన్ 95 మాస్కుల్లో వాల్వ్ ఉన్నది వాడితే గాలి పీల్చుకోవటానికి కూడా ఎలాంటి సమస్య రాదన్న మాట పలువురి నోట వినిపించింది. దీంతో.. ఖర్చు ఎక్కువైనా సరే చాలామంది ఈ వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్కుల్ని వాడటం షురూ చేశారు.
దీంతో.. మాస్కులు వాడే వారిలో అత్యధికులు ఈ ఎన్ 95 మాస్కుల్ని కొనుగోలు చేయటం ప్రారంభించారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఎన్ 95 మాస్కుల్లో కొత్త తరహా డిజైన్లు రావటం కూడా చూస్తున్నదే. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్ 95 మాస్కుల్ని వినియోగించే వారికి కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్కుల్ని వాడే వారంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పింది. వాల్వ్ కు ఏ మాత్రం చిన్న చిల్లు (కన్నం.. రంధ్రం) ఉన్నా అందులో నుంచి కరోనా వైరస్ ప్రయాణించే వీలుందని.. దీని ద్వారా ముక్కులోకి.. నోట్లోకి వైరస్ ప్రయాణించే వీలుందని చెబుతన్నారు. వాల్వ్ ఉన్న మాస్కుల వాడితే.. కరోనా ఆపటం కష్టమంటూ కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొనటం సంచలనంగా మారింది.
ఎన్ 95 వాల్వ్ మాస్కులతో పోలిస్తే.. ఇంట్లో తయారుచేసే మందమైన గుడ్డతో ఉన్న మాస్కులు చాలా మంచిదని చెప్పటం గమనార్హం. ఈ తరహా మాస్కుల్ని వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేయాలని.. ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం కోరుతోంది. వాల్వ్ ఉన్న మాస్కుల్ని వాడొద్దని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం సాగుతోంది.
నిజానికి ఈ వాల్వ్ ఉన్న మాస్కుల్ని తయారు చేసింది వైరస్ కోసం కాదని.. పరిశ్రమల్లో కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ని చేసే వారి కోసం వీటిని తయారుచేస్తారు. కాలుష్యం ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో పని చేసే వారు వాల్వ్ ఉన్న మాస్కుల్ని వాడటం ద్వారా వారు విడిచే గాలిని ఫిల్టర్ చేసి.. మంచి ఆక్సిజన్ ను ముక్కుకు అందిస్తుంది. అయితే.. ఈ మాస్కులకు ఉన్న ప్రధానమైన లోపం కరోనా వైరస్ ను నిలువరించే శక్తి లేకపోవటం. సో.. ఎన్ 95 అందునా.. వాల్వ్ ఉన్న మాస్కుల్ని వాడుతుంటే.. తక్షణం వాటిని పక్కక పెట్టటం మంచిందంటున్నారు. సోకు కోసం చూస్తే.. షాక్ తప్పదు సుమా.
This post was last modified on July 23, 2020 11:27 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…