Trends

వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 ప్రయోగాల వరకు సాగుతున్నాయి. అందులో ఐదారు ప్రయోగాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

పెద్దగా ప్రచారం లేకుండా ఈ నెల మొదట్లో రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్ గురించిన వార్తలు తెర మీదకు వచ్చి అందరి చూపు ఆ దేశం మీద పడేలా చేశాయి. తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫలితాలు బాగున్నాయని.. మూడో దశ హ్యుమన్ ట్రయల్స్ కు రంగం సిద్ధమవుతున్న వేళలో.. రష్యా వ్యాక్సిన్ విడుదల తేదీ మీద తాజా వార్తలు రావటం గమనార్హం.

తాము ఇప్పటికే రెండు ప్రయోగాల్ని పూర్తి చేశామని.. మూడో ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఓవైపు క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్న వేళలోనే.. అందుకు సమాంతరంగా వ్యాక్సిన్ ఉత్తత్తిని షురూ చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో వ్యాక్సిన్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని రష్యా భావిస్తోంది.

రష్యా క్లీనికల్ ప్రయోగాలు సోమవారంతో పూర్తి అయ్యాయని.. రెండో విడతలో పాల్గొన్న 20 మంది వాలంటీర్లను సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లుగా రష్యా48వ కేంద్రీయ శాస్త్ర పరిశోధన సంస్థ అధిపతి సెర్గెయ్ బోరిసెవిచ్ పేర్కొన్నారు. రష్యా రక్షణ శాఖ పత్రిక అయితే క్రాస్నియా జ్వెజ్దాకు ఈ కీలక విషయాన్ని వెల్లడించినట్లుగా అందులో వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్ ను ఆగస్టు మూడు నుంచి మూడో విడత ప్రయోగాల్ని నిర్వహించనున్నారు. రష్యాతో పాటు సౌదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో ప్రారంభించాలని రష్యా కోరుకొంటోంది. వేల మందిపై ప్రయోగాలు ఒకవైపు.. మరోవైపు దీని ఉత్పత్తిని సమాంతరంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను గమాలెయా ఇన్ స్టిట్యూట్ డెవలప్ చేస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దీనికి ఇంకా ఆమోదం రాక ముందే రష్యా దిగ్గజ వ్యాపారస్తులతో పాటు.. రాజకీయ నేతలు దీన్ని వేయించుకుంటున్నారు. విదేశాల్లో 17 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ.. రష్యా చెబుతున్నట్లుగా తన వ్యాక్సిన్ ను వచ్చే నెలలో విడుదల చేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద సంచలనంగా మారుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on July 24, 2020 7:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago