Trends

వినియోగదారులూ.. మీ చేతికి పదునైన కత్తి ఇచ్చారు

షాపులో అమ్మింది తీసుకోవడం.. అది ఎలా ఉన్నా సర్దుకుపోవడం.. మహా అయితే వస్తువును రిటర్న్ చేయడం.. ఇంతకుమించి మనం చేసేదేమీ ఉండదని అనుకుంటాం. కానీ వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయని.. వాళ్ల కోసం బలమైన చట్టాలున్నాయని.. కన్జూమర్ ఫోరంకు వెళ్తే వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతారని చాలామందికి తెలియదు. ఈ దిశగా ఆలోచనే చేయరు.

ఐతే ఇప్పటికే కొంచెం కఠినంగానే ఉన్న వినియోగదారుల భద్రత చట్టాన్ని.. ఇప్పుడు మరింత బలోపేతం చేస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం వినియోగదారులకు కొత్త హక్కులు వచ్చాయి. తాము కొన్న వస్తువు విషయంలో ఏదైనా తేడా జరిగితే చిన్న వస్తువుకు కూడా లక్ష రూపాయల వరకు పరిహారం పొందే అవకాశం ఇస్తోంది ఈ చట్టం.

ఆస్తి, ప్రాణ నష్టం కలిగించే ఉత్పత్తుల నుంచి వినియోగదారుడికి భద్రత కల్పించడం.. కంపెనీలు తమ ఉత్పత్తి, పరిమాణం, సామర్థ్యం, స్వచ్ఛత, ప్రమాణాలు, ధరలపై పూర్తి సమాచారాన్ని కచ్చితంగా అందజేయడం.. ఒకే ఉత్పత్తికి ఇతర పోటీదారులు ఆఫర్ చేస్తున్న ధరలను తప్పక తెలియజేయడం.. న్యాయసమ్మతం కాని, నిషేధిత ఉత్పత్తుల విషయంలో వినియోగదారులకు పరిహారం అందించడం.. ఇవీ వినియోగదారులకు కొత్తగా సంక్రమించిన నాలుగు హక్కులు.

ఇక ఈ చట్టం ప్రకారం కల్తీ వస్తువుల విషయంలో లక్ష వరకు పరిహారం పొందవచ్చు. వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తే రూ.5 లక్షల నుంచి 10 లక్షల దాకా జరిమానా.. రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు తెచ్చారు. ఆ ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం జైలు శిక్షలు తప్పవు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల వివాదాలు, నష్టపరిహార కమిషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చట్టం వినియోగదారుల వ్యవహారాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని నిపుణులు అంటున్నారు.

This post was last modified on July 24, 2020 8:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: Consumer law

Recent Posts

సౌత్‌లో సూపర్ హిట్.. బాలీవుడ్లో డౌటే

రెండేళ్ల కింద‌ట త‌మిళంలో ల‌వ్ టుడే అనే చిన్న సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్ర‌దీప్ రంగ‌నాథన్…

40 minutes ago

ఉత్కంఠ లేదు.. ఢిల్లీ ఓట‌ర్లు క్లారిటీ!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. 699 మంది అభ్య‌ర్తులు..…

44 minutes ago

కేసీఆర్ అండ్ కో అరెస్టులపై సీఎం రేవంత్ ఏమన్నారు?

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఒక సుగుణం ఉంటుంది. ఆయన్ను కలవటం.. టైం…

2 hours ago

ఎన్నాళ్ళో వేచిన ఉదయం… చైతుకి ఎదురయ్యింది

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని సినిమాలు కనీస టాక్…

2 hours ago

బ్యాడ్ అంటూనే భేష్షుగా చూస్తున్నారు

మేము పాత చింతకాయ పచ్చడి సినిమా తీస్తున్నాం అని పబ్లిసిటీ చేయాలంటే నిర్మాతకు బోలెడు ధైర్యం కావాలి. అందులోనూ ఒక…

2 hours ago

బాబు సత్తా!.. సీన్ మొత్తం రివర్స్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్ లోనే ఇప్పుడు యమా స్ట్రాంగ్ గా…

3 hours ago