‘సెక్స్ కాల్‌’తో అడ్డంగా దొరికేసిన పాక్ మాజీ పీఎం

మాజీ స్టార్ క్రికెట‌ర్‌.. పాకిస్థాన్‌ మాజీ పీఎం, తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ సెక్స్ కోసం ఓ మహిళతో అస‌భ్యక‌రంగా మాట్లాడిన రెండు ఆడియో క్లిప్‌లు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. దీంతో ఇప్ప‌టికే ఇమ్రాన్‌పై ఆగ్ర‌హంతో ఉన్న పాకిస్థాన్ ప్ర‌జ‌లు ఇప్పుడు మ‌రింత నిప్పులు చెరుగుతున్నారు. ఇప్ప‌టికే 4 పెళ్లిళ్లు చేసుకోగా.. చిత్రంగా అంద‌రూ కూడా ఇమ్రాన్‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా వైర‌ల్ అవుతున్న వీడియో పాకిస్థాన్లో దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని పేర్కొంది. ఇది ఇమ్రాన్‌ వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర అని ల‌బోదిబోమంటోంది.

అసలు ఏంజ‌రిగిందంటే..

లీక్‌ అయిన 2 ఆడియో క్లిప్‌ల్లో ఇమ్రాన్‌ ఖాన్‌గా భావిస్తున్న వ్యక్తి.. ఫోన్‌లో ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. తనను ప‌ర్స‌న‌ల్‌గా ఒత్తిడి చేస్తున్నాడు. మరో క్లిప్‌లో సదరు మహిళ మర్నాడు వస్తానని అంటోంది. ఆ సమయంలో సదరు వ్యక్తి మాట్లాడుతూ ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని.. కుదిరితే వారి రాకను ఆలస్యం చేసేందుకు యత్నిస్తానని చెప్పారు. ఏ విషయం మర్నాడు మళ్లీ ఫోన్‌ చేసి క‌న్ఫ‌ర్మ్ చేస్తాన‌ని కూడా చెప్పాడు.

రెండు భాగాలుగా ఉన్న ఈ ఆడియో క్లిప్‌లను పాకిస్థాన్ జర్నలిస్టు సయీద్‌ అలీ హైదరీ.. తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా షేర్‌ చేశారు. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ వైదొలిగాక.. ఆయనకు సంబంధించిన పలు ఆడియో క్లిప్‌లు ఇంతకుముందు కూడా లీకయ్యాయి. తాజా ఆడియో క్లిప్‌లపై ఇమ్రాన్ సొంత పార్టీ తెహ్రీక్‌- ఇ-ఇన్సాఫ్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. అవన్నీ నకిలీ ఆడియో క్లిప్‌లని పేర్కొంది.