తెలుగు బుల్లితెరపై కొన్ని వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను అలరించిన కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు అతను జబర్దస్త్ వదిలేశాడు. ఈ మధ్యనే తాను ప్రేమించిన అమ్మాయితో ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
ఇక మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యనే ఆర్పీ హైదరాబాద్ లో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు. తన స్వస్థలమైన నెల్లూరు చేపల పులుసుకి ప్రసిద్ధి కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు.
మామూలుగా తాను చేసే చేపల పులుసుని అతని మిత్రులు లొట్టలు వేస్తూ ఆరగించేవారంట. ఇక ఇక్కడ కూడా ఆ చేపల పులుసుకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించాడు. ఇక్కడ చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు లభిస్తాయి. ఇవన్నీ కట్టెల పొయ్యి మీదనే వండడం గమనార్హం.
ఇక త్వరలోనే నగరంలో మరో 15 పాయింట్స్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట మన ఆర్పీ. ఆర్పీ చివరగా నాగబాబు జడ్జి గా వ్యవహరించిన కామెడీ స్టార్స్ అనే టీవీ షో లో కనిపించాడు.